మన భారతీయ పురాణాల్లో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు వారు నిలువెత్తు నిదర్శనం. కుటుంబ పరువు ప్రతిష్ఠలు ఆ ఇంటి ఇల్లాలి పై ఆధారపడి ఉంటాయి. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే మహిళలు మనకు పురాణాల్లో ఎందరో కనిపిస్తారు. ఒకసారి వివాహం అయిన తరువాత పరాయి వారిపై కామం, మోహం తగదు. పూర్వకాలం స్త్రీలు అలానే ఉండే వారు. అయితే ప్రస్తుతం కొందరు స్త్రీలు వావి వరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అలాంటి వారికి కన్నువిప్పు కలిగించేలా ఓ స్త్రీ ప్రవర్తన తీరు ఆదర్శం. పెళ్లైన మహిళ ఎంత పవిత్రంగా ఉండాలో వివరించే ఓ పురాణ కథ ఒకటి తెలుసుకుందాం…
పూర్వం ఓ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు..తన రాజ్యం అంత తిరిగి రావాలని కోరిక పుట్టింది. అయితే దట్టమైన అడవులు ఉంటాయి కాబట్టి వెళ్లడం మంచి కాదని తన మంత్రులు, సేనాధిపతి.. రాజు తెలియజేశారు. వారి మాటలు విని కొన్నాళ్లు ఆగినా ఆ రాజుకు మనస్సులో మాత్రం రాజ్యం మొత్తం ఒంటరిగా వెళ్లి చుట్టేసి రావాలని కోరిక బలంగా ఉంది. ఈ సారి ఎవరి మాట వినకుండా తన గుర్రంపై దేశ పర్యటనకు బయలు దేరాడు. ఈక్రమంలో అడవికి సమీపంలోని ఓ గ్రామంలో ఆగిన రాజు ఓ స్త్రీని చూశాడు. ఆమె ముఖ సౌందర్యానికి ఆ రాజు ముగ్ధుడయ్యాడు. ఆమెను అనుకరిస్తూ ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంతలో ఇంట్లో ఆ స్త్రీ భర్త భోజనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ స్త్రీ భర్త ఉండటానికి గమనించిన రాజు.. బయట నుంచి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో సదరు స్త్రీ..తన భర్తకు భోజనలు వడ్డించి పెట్టింది. అతడు తినేసి పని మీద బయటకు వెళ్లాడు. దీంతో రాజు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లాడు.
ఆమె.. రాజును.. మీరు ఎవరు? అని ప్రశ్నించింది. ఆ రాజు లోపలకి వచ్చి కూర్చుని.. ఈ రాజ్యానికి నేనే రాజునని.. తనను తానూ పరిచయం చేసుకున్నాడు. అంతే కాక నీవు ఎంతో అందం గా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఆ స్త్రీతో రాజు అన్నాడు. రాజు మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది. తనకు పెళ్లి అయినదని రాజు తెలిపింది. అయినా పర్వాలేదు, నీ అందం నాకు సొంతం కావాలంటూ భీష్మించుకు కూర్చున్నాడు. దీనితో ఆమెకు పాలుపోలేదు. మహారాజును ఎదిరించే స్థాయి కాదు. పొరపాటున ఏమైన ఎదిరించి మాట్లాడిన తన భర్తతో సహా కుటుంబ మొత్తాన్ని ఏమైన హాని చేస్తాడేమే అని ఓ భయం పట్టుకుంది. రాజు మాటకు తలొగ్గితే.. తాను బ్రతికిన చచ్చిన దానితో సమానం. అంతకంటే చావడం మేలు అని భావించింది.
కొద్ది సమయం పాటు ఆ స్త్రీకి ఏమి అర్ధం కాలేదు. ఎంతో గుణవంతురాలు,సంస్కారం గల మహిళ ఆమె. అందుకే రాజుకు అర్ధమయ్యే విధంగా గుణపాఠం చెప్పాలని భావించింది. దీంతో రాజుగారిని ముందుగా భోజనం చేయడానికి పిలిచింది. చాలా దూరం నుంచి వస్తున్నట్లున్నారు..బాగా అలసి పోయి ఉంటారు అంటూ.. తన భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకును రాజుగారి ముందు వేసింది. అది చూసి మహారాజు కు కోపం కట్టలు తెచ్చుకుంది. ‘నీ భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకులో నేను భోజనం చేయాలా?నీకు వెంటనే కఠినకారాగార శిక్ష వేయిస్తాను’ అంటూ ఆగ్రహించాడు.
అప్పుడు ఆమె రాజుగారి కళ్లను తెరిపించే మాటలు చెప్పింది. రాజా.. శాంతించండి.. నా భర్త భోజనం చేసిన ఆకులో భోజనం చేయడానికి అడ్డుగా వచ్చిన ఎంగిలి..నా విషయంలో కూడా ఉంటాది కదా? నేను మీరు మోహించక ముందే ఆయన సొంత అయిపోయాను కదా? అలాంటి నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎగిలి అడ్డు రాలేదా?”అని ప్రశ్నించింది. దీంతో రాజు గారి విషయం బోధపడింది. నన్ను క్షమించు తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పరాయి పురుషుడి మాటలకు, డబ్బులకు కొందరు మహిళలు వ్యామోహ పడుతుంటారు. అలాంటి వారికి, పరాయి స్త్రీని చెడుగా దృష్టి తో చూసే వ్యక్తులకు ఈ కథ ఓ కనువిప్పుగా ఉంటుంది. అందుకే పరాయి స్త్రీని ఎప్పుడు చెడు దృష్టితో చూడకూడదని మన పెద్దలు మనకు చెబుతూ వస్తున్నారు.