‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ అంతటా హాట్‌టాపిక్ అయ్యాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. వారిని ఎందుకు ప్రశ్నించరు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మధ్యలో అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు మంత్రి పేర్ని నాని.
‘ఆన్లైన్ టికెట్ల గురించి పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడి పెడితే మీరెందుకు టికెట్లు అమ్మతారని అడుగుతున్నారు. మేము కిందా మీద పడి యాక్ట్ చేస్తున్నాం. అందుకే మాకు కోట్లు ఇస్తున్నారు. మేము ఎందుకు ఆదాయపన్ను కట్టాలి? అని ప్రశ్నించండి’ అని పేర్ని నాని సవాలు చేశారు. అలాంటి ప్రశ్నలు అడాగాలంటే మీకు భయం. అందుకే మీరు వాళ్లని ప్రశ్నించరు అంటూ ఎద్దేవా చేశారు. ‘దర్శకులు కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు. ‘మీకు మేమెందుకు జీఎస్టీ కట్టాలి అని ప్రశ్నించు’ అని పేర్ని నాని సవాలు చేశారు. వాళ్లని ఎందుకు ప్రశ్నించరంటే వాళ్లంటే మీకు భయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతున్నారు అంటూ పేర్ని నాని అన్నారు.