కర్ఱాటకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లోకి తాచు పాము వచ్చింది. అయితే అది పాము కాదని, నా భర్తే పాము రూపంలో వచ్చాడని చెబుతోంది. మహిళ చెబుతున్న మాటలు విన్న స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా. స్థానికంగా శారవ్వ కంబార మహిళ నివాసం ఉంటుంది.కాగా గత రెండేళ్ల కిందట ఆ మహిళ భర్త మరణించాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగానే ఉంటూ కాలాన్ని వెల్లదీస్తుంది.
ఇదిలా ఉంటే గత నాలుగు రోజుల క్రితం ఆ మహిళ ఇంట్లోకి తాచు పాము వచ్చింది. అయితే ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా దాని అలనా పాలన చూసుకుంటుంది. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే.. అది పాము కాదని, నా భర్తే తాచు పాము రూపంలో వచ్చాడని అంటోంది.ఇక ఇంతటితో ఆగకుండా ఆ పాముకు దీనికి కావాల్సిన ఆహారం పెడుతూ తన బెడ్ మీద పెట్టుకుని పెంచింది. ఈ విషయం ఇరుగు పొరుగువారికి తెలియడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. మెల్ల మెల్లగా ఈ వార్త ఫారెస్ట్ ఆఫీసర్ల వరకు పాకింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పామును సంచిలోకి బంధించి అడవుల్లోకి వదిలిపెట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.