ఈ మధ్య కాలంలో ఏజ్ గ్యాప్‌తో ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఎక్కువయిపోయాయి. తమకంటే ఎక్కువ వయసున్న వారితో ప్రేమలో పడటమే కాదు.. వారినే యువతీ, యవకులు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. తాజాగా, ఓ యువతి కూడా తనకంటే 50 సంవత్సరాలు పెద్దవాడైన వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రస్తుతం అతడితో డేటింగ్లో ఉంది. ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ గురించి, పెళ్లి విషయం గురించి ఆమె నెటిజన్లను ఓ సలహా అడిగింది. ఈ మేరకు ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఓ పోస్టింగ్ పెట్టింది. ఆ పోస్టింగ్‌లో.. ‘‘ నా వయసు 23 సంవత్సరాలు.. నేను 71 ఏళ్ల అద్భుతమైన వ్యక్తితో గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నాను.
నేను అతడ్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి భవిష్యత్తు గురించి ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నాను. ఓ సారి మా మాధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. నాకు పిల్లలు అక్కర్లేదు. అతడి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. చాలా చురుకుగా కూడా ఉన్నాడు. చాలా సార్లు నాకంటే చురుగ్గా అతడు ఉంటున్నాడు. అతడి అమ్మానాన్నలు ఇంకా బతికే ఉన్నారు. వారి వయసు దాదాపు 90 సంవత్సరాలు. అతడి తల్లి తన పనులు తానే చూసుకోగలగుతోంది. అయితే, ఆమెకు అల్జీమర్స్ లేదా డిమెంట్షియా ఉంది.
అప్పుడప్పుడు ఇబ్బందిపడుతూ ఉంటుంది. అది చూసినపుడు అతడి గురించి మరింత ఎక్కువగా ఆలోచించాల్సి వస్తోంది. అతడికి ఎక్కువ కేర్ కావాలనిపిస్తుంది. అతడి తండ్రికి మతిమరుపు సమస్యలు లేవు. కానీ, గుండెపోటు ఉంది. నా బాయ్‌ఫ్రెండ్‌కు పిల్లలు లేరు. మీకు ఉద్యోగం ఉన్నపుడు ఓ ముసలివాడైన పార్ట్నర్ను చూసుకోవటం ఎలా అనిపిస్తుంది? పెళ్లికి పులుస్టాప్ పెడదామని అనుకుంటున్నా. కానీ, అతడితో ఓ దశాబ్ధం లేదా రెండు దశాబ్ధాలు సంతోషంగా గడిపితే అదే చాలు. నేను అతడ్ని చూసుకోవటానికి, ప్రేమించటానికి అర్హురాలినని స్పష్టం చేస్తున్నా’’ అని పేర్కొంది.