పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సేల్స్ మొదలపెట్టాయి. ఈ సేల్స్‌లో అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులో వచ్చాయి. అందులోనూ శాంసంగ్ బ్రాండ్ కు చెందిన పాపులర్ మోడళ్లతో పాటు లేటెస్ట్ ఫోన్లు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు శాంసంగ్ ప్రొడక్టులను విపరీతంగా కొనేశారు. ఈ కారణంగా శాంసంగ్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సేల్స్ తొలి రోజున సునామీ సృష్టించింది. ఆ వివరాలు..
సేల్స్ తొలి రోజున అంటే.. ఆదివారం(సెప్టెంబర్ 23) ఒక్కరోజే 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని శాంసంగ్ వెల్లడించింది. వీటి విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ఈ సేల్స్‌లో గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్లపై 17 నుంచి 60% వరకు డిస్కౌంటుతో శాంసంగ్ అందుబాటులో ఉంచింది. ఆపై బ్యాంక్ కార్డు ఆఫర్లతో మరింత తక్కువ ధరకే కస్టమర్లకు దక్కాయి. దీంతో కొనుగోలుదారులు ఎడా పెడా కొనేశారు. “సేల్స్ తొలి రోజు.. 1.2 మిలియన్ల కంటే ఎక్కువ గెలాక్సీ డివైజ్‌లను శాంసంగ్ అమ్మింది. ఇండియాలో ఇది సరి కొత్త రికార్డ్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఈసారి ఆఫర్లు ప్రకటించాం. అందువల్లనే ఇది సాధ్యమైంది. 24 గంటల్లో రూ.1,000 కోట్ల విలువైన శాంసంగ్ గెలాక్సీ డివైజ్‌లు అమ్ముడయ్యాయి” అని శాంసంగ్ పేర్కొంది.
Samsung India sold over 12 lakh Galaxy smartphones worth more than Rs 1,000 crore on the first day of sales at Amazon and Flipkart, the company said on Sunday, adding that it has created a new record in India. #samsung pic.twitter.com/jqUgyCgqHT
— Marketing Motivation (@marketing_motiv) September 26, 2022
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఎస్ఈ 5జీ, గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా, గెలాక్సీ ఎం53, గెలాక్సీ ఎం33, గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ ఎం13 మోడల్స్ ఎక్కువగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో ఉన్నాయి. వీటిలో గెలాక్సీ ఎం13 బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచిందని కంపెనీ తెలిపింది. సేల్స్ ఈ నెల ఆఖరి వరకు జరగనున్నాయి. అప్పటివరకు 50 లక్షలకు పైగా అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.