టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో దాయాది పాకిస్తాన్ చెప్పుకోదగ్గ ఆటతీరు కనపరచలేకపోయింది. భారత్‌తో మ్యాచ్‌లో చివరి బంతికి ఓడిన పాక్.. జింబాబ్వేపై ఒక్క పరుగు తేడాతో భంగపాటుకు గురైంది. దీంతో పాక్ జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై నెదర్లాండ్స్‌పై గెలిచినప్పటికీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అద్భుతాలు జరగాల్సిందే. దీనంతటికి కారణం పాక్ సారధి బాబర్ ఆజాం కారణమంటూ విమర్శలొస్తున్నాయి. అందులోనూ అతడు నిలకడగా రాణించకపోవడం అతని కెప్టెన్సీకే ముప్పుతెచ్చేలా ఉంది.
ఈ టోర్నీలో పాకిస్తాన్ ఓటమికి, ఆ జట్టు ఓపెనింగ్ జోడీయే ముఖ్యకారణం. బాబర్ ఆజాం- మహమ్మద్ రిజ్వాన్ ల జోడి ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లోనూ ఒక మ్యాచులో కూడా మంచి ఆరంభాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా ఆ జట్టు సారధి బాబర్ ఆజాం రాణించకపోవడం వారిని తీవ్రంగా దెబ్బకొట్టింది. భారత్ తో జరిగిన మ్యాచులో డకౌట్ గా వెనుదిరిగిన బాబర్, ఆ తరువాత జింబాబ్వేతో జరిగిన మ్యాచులో 4 పరుగులకే వెనుదిరిగాడు. పోనీ, పసికూన నెదర్లాండ్స్ పైన అయినా రాణిస్తాడనుకుంటే అక్కడా 4 పరుగులకే ఔటై మరోసారి నిరాశపరిచాడు. ఇక తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో 6 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో బాబర్, ఇలా ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విఫలమవడంతో అతనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
Babar Azam in this #T20WorldCup
0 vs India
4 vs Zimbabwe
4 vs Netherlands
6 vs South Africa#PAKvSA pic.twitter.com/njvo3zmFBj— Cricbuzz (@cricbuzz) November 3, 2022
ఈ టోర్నీలో బాబర్ ఆజాం 4 మ్యాచుల్లో చేసిన పరుగులు 14 కాగా, యావరేజ్ 3.50గా, స్ట్రైక్ రేట్ 46 గా ఉంది. ఈ గణాంకాలను టెయిలండర్లతో పోలుస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాబోవు మ్యాచుల్లో షాహీన్ ఆఫ్రిదిని ఓపెనర్ గా ఆడించి, బాబర్ ఆజాంను అతని స్థానంలో ఆడించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ జట్టు విషయానికొస్తే.. ఇప్పటివరకు 3 మ్యాచులు ఆడిన పాక్ ఒక విజయం, రెండు అపజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నేడు సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో విజయం సాధిస్తే సెమీస్ రేసులో ఉన్నట్లే లెక్క.
Comment below with 🇮🇳 emoji if this points table puts up a smile on your face 🤩#OneFamily #T20WorldCup #INDvBAN @surya_14kumar @ICC pic.twitter.com/YHFx0CyarA
— Mumbai Indians (@mipaltan) November 2, 2022