టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క పరుగు తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టు, కెప్టెన్ బాబర్ అజమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ దేశ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం పాకిస్థాన్ జట్టును, కెప్టెన్‌ను దారుణంగా తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను చెత్త కెప్టెన్‌గా అభివర్ణించాడు. జింబాబ్వే టీమ్ పాకిస్థాన్‌ను ఓడించడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని అక్తర్.. జట్టు చెత్త ప్రదర్శనకు కారణాలు, కెప్టెన్సీ లోపాలను ఎత్తిచూపాడు. ముఖ్యం కెప్టెన్ బాబర్ అజమ్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించాడు.
అక్తర్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌కు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందు ఊహించాను. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా లోపాలు ఉన్నాయనే విషయాన్ని నేను పదే పదే చెప్తున్నాను. కానీ.. వాళ్లు పట్టించుకోలేదు. బాబర్ అజమ్ వన్‌డౌన్‌లో వచ్చి ఫకర్ జమాన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని సూచించాను.. కానీ.. బాబర్ తన ఓపెనింగ్ స్థానాన్ని వదిలిపెట్టడు. స్వార్థంగా ఆడతాడు. అలాగే పాకిస్థాన్ ఓడిన మూడు మ్యాచ్‌ల్లో నవాజ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేశాడు. ఇది బాబర్ చెత్త కెప్టెన్సీని ప్రతిబింబిస్తోంది. అలాగే.. వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ ఇంటికి వచ్చేసినట్లే’ అక్తర్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా చేతిలో తొలి మ్యాచ్ ఓడిన పాకిస్థాన్.. అనూహ్యంగా జింబాబ్వే చేతిలో ఓడి.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఈ ఓటమి పాకిస్థాన్ టీమ్‌ను తీవ్రంగా కుంగదీసిందనే చెప్పాలి. గ్రూప్ బీలో పాకిస్థాన్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి… పాక్ సెమీస్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇక బాబర్ అజమ్ కూడా తమ జట్టు సెమీస్ చేరడం కష్టమనే విషయం వ్యక్తం చేశాడు.
Shoaib Akhtar lambasts Babar Azam’s captaincy after Pakistan two back to back losses in T20 World Cup 2022.#T20worldcup22 #PAKvsZIM pic.twitter.com/7KS2RQvOyY
— CricTracker (@Cricketracker) October 28, 2022