ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా మూడు మ్యాచ్‌లు ఆడితే.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓపెనింగ్ జోడి సక్సెస్ కాలేదు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ రెండు, మూడో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చేశాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా మంచి స్టార్ లభించలేదంటూ అందుకు కారణం కేఎల్ రాహుల్ వైఫల్యం. మరో ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ ఉంది. కానీ.. రాహుల్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసిన పరుగులు 22 మాత్రమే. పాక్‌పై 4, నెదర్లాండ్స్‌పై 9, సౌతాఫ్రికాపై 9 రన్స్ చేశాడు. తొలి ఓవర్లలోనే తన వికెట్ పారేసుకోవడం.. లేదంటే డాట్స్ బాల్స్ ఆడుతూ రోహిత్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు.
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్ కారణంగా మరో ఎండ్‌లో ఉండే రోహిత్ శర్మపై పరుగులు చేయాల్సిన ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో రోహిత్ వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ విధంగా తాను విఫలం అవుతూ.. రోహిత్‌ను కూడా ఫెయిల్ చేస్తున్నాడు రాహుల్. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ లేదా.. రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే టీమిండియా సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నా.. సెమీస్ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఇలాంటి ప్రదర్శన నెగ్గుకురావడం కష్టమే. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ను బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో పక్కనపెట్టి పంత్‌ను ఓపెనర్‌గా ఆడిస్తారనే వార్తలు వెలువడ్డాయి.
అయితే రేపటి బంగ్లాతో మ్యాచ్‌కు ముందు.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌పై తనకు కెప్టెన్ రోహిత్ శర్మకు పూర్తి నమ్మకం ఉందని.. అతన్ని ఓపెనర్‌గా ఆడించడంతో తనతో పాటు కెప్టెన్ రోహిత్‌కు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశాడు. కేఎల్ రాహుల్ ఎలాంటి ఇంప్యాక్ట్ చూపిస్తాడో మనందరికి తెలుసని ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మళ్లీ కేఎల్ రాహుల్-రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభించనున్న విషయం స్పష్టమైంది. అయితే దినేష్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్ తుది జట్టులోకి అవకాశం ఉంది. అలాగే దీపక్ హుడాను కూడా పక్కన పెట్టనున్నారు. అతని స్థానంలో అక్షర్ పటేల్, అశ్విన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ టీమ్‌లోకి రావచ్చు.
Rahul Dravid said “Me & Rohit dont have absolutely no doubt who will open, I know how much impact KL Rahul can make”.
— Johns. (@CricCrazyJohns) November 1, 2022
Rahul Dravid on KL Rahul:
“There is no doubt in mine and Rohit’s mind who is going to open the innings for India tomorrow. KL has our full backing and we know what he is capable of” pic.twitter.com/U6CP0zDu4t
— Nikhil Naz (@NikhilNaz) November 1, 2022