టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్ 2022లో దారుణంగా విఫలం అవుతున్నాడు. అతని పూర్ ఫామ్ జట్టుపై పెను భారం మోపుతోంది. అతని స్లో బ్యాటింగ్ అప్రోచ్ టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మపై కూడా ఒత్తిడి పెంచుతోంది. వరల్డ్ కప్‌కు కొన్ని రోజుల ముందే గాయం, కరోనా నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. వరల్డ్ కప్‌లోనూ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలమైనా.. పాకిస్థాన్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి రాహుల్ చేసిన పరుగులు 22 మాత్రమే. ఒక్క మ్యాచ్‌లో కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు.
సౌతాఫ్రికాపై ఓటమి తర్వాత బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు రాహుల్‌ను డ్రాప్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కానీ.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉంటాడు.. ఓపెనింగ్ అతనే చేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. పైగా.. టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. నెట్స్‌లో కేఎల్ రాహుల్‌కు బౌన్స్‌ను ఎలా ఎదురుకోవాలో సలహాలు ఇచ్చాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. కేఎల్ రాహుల్‌కు విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు పలు సలహాలు ఇవ్వటం మంచి విషయం అని కొనియాడాడు. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్‌లపై కోహ్లీకి అనుభవంతో మంచి రికార్డులు ఉన్నాయని అన్నాడు.
అలాగే కేఎల్ రాహుల్‌కు ఆఫ్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతులను ఎలా ఎదుర్కొవాలో కోహ్లీ వివరించి ఉంటాడని గవాస్కర్ తెలిపారు. కాగా.. కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఒకసారి ఆఫ్‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతికి, మరోసారి ఇన్సైడర్ బంతికి వికెట్ల మీదకు ఆడాడు. ఇలా బంతి ఎటు వైపు స్వింగ్ అయినా ఇబ్బంది పడుతున్నాడు. కాగా.. కేఎల్ రాహుల్ ఒక క్లాస్ ప్లేయర్ అనే విషయం మరువుకూడదని గవాస్కర్ అన్నారు. ‘నిజానికి రాహుల్ ఒక అద్భుతమైన ఆటగాడు. కానీ అతనిపై అతనికి నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు’ అని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డారు. కేఎల్ రాహుల్ ఈ బ్యాడ్ఫేజ్ను దాటాలంటే తనను తాను నమ్మాలని.. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఈ రోజు నేను బాగా ఆడతాననే నమ్మకం తనలో వస్తే.. కచ్చితంగా మంచి ఇన్నింగ్స్ రాహుల్ నుంచి వస్తుందని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. మరి బంగ్లాదేశ్‌పై కేఎల్ రాహుల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
Former India captain #SunilGavaskar feels out-of-form batter #KLRahul doesn’t trust his abilities. The India opener has struggled to score runs in the ongoing T20 World Cup in Australia#INDvBAN #T20WorldCuphttps://t.co/bv6GbzTNbQ
— CricketNDTV (@CricketNDTV) November 2, 2022