క్రీడా ప్రపంచంలో ప్రతీ ఆటగాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఆటగాడు గొప్పవాడు కావడానికి కేవలం అతడి గణాంకాలే నిదర్శనం కాదు. అతడు మైదానంలో ప్రవర్తించే తీరును కూడా పరిగణంలోకి తీసుకుంటారు. అందుకే ప్రతీ క్రీడాకారుడు నిబంధనలకు లోబడే వ్యవహరించాలి. కానీ మ్యాచ్ ఓడిపోతామనే భయం వల్ల కొంత మంది ఆటగాళ్లు.. తొండాట ఆడుతుంటారు. అలా తొండాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయాడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోబోయిన విలియ్సన్.. దాంట్లో విఫలం అయ్యాడు. కానీ ఆ విషయాన్ని దాచి అవుట్ అంటూ సంబరాలు చేసుకున్నారు. రిప్లేలో అది నాటౌట్ గా అంపైర్లు ప్రకటించారు. దాంతో నెటిజన్స్ విలియమ్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేన్ విలియమ్సన్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో ఎటువంటి మచ్చలేని వ్యక్తిగా కేన్ మామ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక విలియమ్సన్ కు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కు దగ్గరి సంబంధం ఉంటుంది. ఇద్దరు వారి పని వారు చేసుకుంటూ.. ఎటువంటి వివాదాల జోలికి పోకుండా క్లీన్ సర్టిఫికెట్ కలిగిన అతికొద్ది మంది క్రికెటర్లలో వీరిద్దరు ముందు వరుసలో ఉన్నారు. కానీ తాజాగా జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో సంఘటనతో కేన్ విలియమ్సన్ పై ఓ మాయని మచ్చ పడింది. అసలు విషయానకి వస్తే.. ఇంగ్లాండ్ 4 ఓవర్లలో 24 పరుగులు చేసింది. 5వ ఓవర్ నుంచి గేర్ మార్చిన బ్రిటీష్ బ్యాటర్లు.. సౌథీ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు పిండికున్నారు. దాంతో విలియమ్సన్ సాంటర్న్ ను రంగంలోకి దించాడు. ఈ ఓవర్లో 3వ బంతిని షాట్ ఆడబోయాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్. కానీ బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ఎక్స్టా కవర్స్ మీదుగా బాల్ గాల్లోకి లేసింది. ఆ బాల్ ను అద్భుతంగా డైవ్ చేస్తూ ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశాడు విలియమ్సన్. కానీ బంతి జారి గ్రౌండ్ కు తగిలింది. అలాగే జారుతూ బంతి చేతిలోనే ఉందనుకున్నాడు కేన్ మావ.
— Richard (@Richard10719932) November 1, 2022
దాంతో బట్లర్ అవుట్ అని కివీస్ ఆటగాళ్లు అందరు సంబరాలు చేసుకున్నారు. బట్లర్ కూడా అవుట్ అనుకునే పెవిలియన్ వైపు నడవసాగాడు. కానీ రిప్లేలో బాల్ క్లియర్ గా భూమికి తాకినట్లు తేలడంతో అంపైర్లు బట్లర్ వెనక్కి పిలిపించారు. దాంతో తన తప్పు తెలుసుకున్న విలియమ్సన్.. బట్లర్ కు సారీ కూడా చెప్పాడు. కానీ ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.”ఏంటి కేన్ మావ మిస్టర్ క్లీన్ గా ఉండి ఈ చెత్త పనులు ” కేన్ విలియమ్సన్ చీటర్” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంత మంది మాత్రం..” డైవ్ చేసే క్రమంలో బాల్ గ్రౌండ్ కు తాకినట్లు విలియమ్సన్ కు తెలీదు కాబట్టే అలా చేశాడు” అంటూ కేన్ మావకు మద్దతు పలికారు. అయితే తన జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా ఉన్న విలియమ్సన్.. తాజా సంఘటనతో దానిని కోల్పోయాడు. ఇక అటు బ్యాటింగ్ లోనూ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి న్యూజిలాండ్ ఓటమికి కారణం అయ్యాడు.
Kane Williamson apologized to Jos Buttler for being wrong in claiming the catch. pic.twitter.com/f01j6PwhBG
— Johns. (@CricCrazyJohns) November 1, 2022
Kane Williamson pic.twitter.com/THKPdXRLIv
— Zak (@Zakr1a) November 1, 2022
When someone asks me about Kane Williamson claiming a catch that was dropped. #ENGvNZ pic.twitter.com/CB5N4NWLnH
— Ashlee (@_itsashleeee_) November 1, 2022
#ENGvsNZ
Umpires to kane williamson pic.twitter.com/7DFYOYKtWf— Shalini patel (@shalinipatel29) November 1, 2022
Everyone would be calling Kane Williamson a cheat if he weren’t a Kiwi with that nice-guy image. #T20WC2022
— Pedro James (@pedrojr_90) November 1, 2022
I wager someone without Kane Williamson’s nice guy reputation would get slaughtered for claiming that.
I do believe he genuinely thought he caught it cleanly, but a player with a “worse” reputation would be judged differently.
— Mark Puttick (@GryllidaeC) November 1, 2022