ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ శోకసంద్రంలో మునిగిపోయి ఉంది. చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై ఎదురైన ఓటమినే ఇంకా జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్ క్రికెటర్లకు, అభిమానులకు.. హార్ట్‌స్ట్రోక్ తెప్పించే సంచలనం నిన్న నమోదైంది. ఇప్పటికే టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడి.. ఓటమి బాధలో ఉన్న పాక్‌ను జింబాబ్వే మరింత కుంగదీసింది. ఎవరూ ఊహించని విధంగా పాకిస్థాన్.. సీనియర్ పసికూన జింబాబ్వే చితిలో మట్టికరిచింది. కేవలం 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకోలేక.. ఒక్క పరుగు దూరంలో పాక్ చతికిలపడింది. ఈ ఓటమి భారం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల మతిపొగొట్టినట్టు ఉంది. అందుకే.. పాక్ టీమ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే.. టీమిండియాపై కూడా పడిఏడుస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్ మాజీ పేసర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి తర్వాత మాట్లాడిన అక్తర్.. పాకిస్థాన్‌కు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ముందే చెప్పినట్లు వెల్లడించాడు. యావరేజ్ సెలెక్షన్‌తో ఇలాంటి ఫలితాలే వస్తాయని పాక్ టీమ్‌పై మండిపడ్డాడు. అలాగే బాబర్ అజమ్ కెప్టెన్సీపై కూడా అక్తర్ విమర్శలు గుప్పించాడు. ఇక పాక్ టీమ్ ప్రదర్శనతో ఏ మాత్రం సంతృప్తిగా లేని షోయబ్ అక్తర్ తన అక్కసును టీమిండియాపై కూడా వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్ కప్‌లో తామ టీమ్ పని దాదాపు అయిపోయిందని.. పాకిస్థాన్ ఇంటి వచ్చేసినట్లే అని పేర్కొన్న అక్తర్.. టీమిండియా కూడా వచ్చే వారం సెమీస్ తర్వాత ఇంటికి వచ్చేస్తుందని కామెంట్ చేశాడు. నిజానికి టీమిండియా అంత తీస్‌మార్ ఖాన్ టీమ్ ఏం కాదని అక్తర్ పేర్కొన్నాడు.
కాగా.. ప్రస్తుతం టీమిండియా గ్రూప్ 2లో రెండు విజయాలతో టాప్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్లతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. తర్వాతి మ్యాచ్‌లో నెథర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్, జింబాబ్వేతో కూడా ఓడిపోవడంతో.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. పాక్ సెమీస్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడంతో పాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధార పడాల్సి ఉంది. గ్రూప్ 2 నుంచి టీమిండియా దాదాపు సెమీస్ చేరడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాక్ మాజీలు తమ జట్టు దారుణ ప్రదర్శనతో మనస్థాపానికి గురై.. ఆ అక్కసును టీమిండియాపై వెళ్లదీస్తున్నారని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Shoaib Akhtar – “I already said that Pakistan will return this week and India will return next week. They are also not any powerhouse (‘Tees Maar Khan’)”pic.twitter.com/ZPtGO8hFuW
— 12th Khiladi (@12th_khiladi) October 28, 2022