అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా సూపర్ హిట్ అయిన రోహిత్ త్వరలో టెస్టు కెప్టెన్‌గా కూడా తన సత్తా చూపనున్నాడు. కాగా రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించిన తర్వాత అతని టెస్టు కెరీర్‌పై సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2018లో టీమిండియాలో బెంచ్‌కే పరిమితం అయి.. వాటర్ బాయ్‌గా ఉన్న రోహిత్ శర్మ ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ అయ్యాడు అంటూ రోహిత్ బ్యాట్స్‌మెన్లకు వాటర్ అందిస్తున్న ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే సక్సెస్ అంటే ఇది అంటూ రోహిత్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన 34వ ఏటా టెస్టు కెప్టెన్‌గా తప్పుకుని, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్తే.. రోహిత్ తన 35వ ఏటా టెస్టు కెప్టెన్ అయ్యాడు. ధోని చిన్న వయసులోనే టీమిండియా టెస్టు పగ్గాలు చేపట్టి భారత్‌ను విజయపథంలో నడిపి.. భారత్ సారథి హోదాను అనుభవిస్తే.. దాదాపు ఒక ఏడాది తేడాతో అదే వయసులో రోహిత్ టీమిండియా సారథి బాధ్యతలు తీసుకున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి రోహిత్ కూడా ధోని తరహాలో భారత్‌కు ఎన్నో అపురూప విజయాలు అందించాలని ధోని, రోహిత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ పోస్టులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
pic.twitter.com/kpzGsxH9aQ
— Sayyad Nag Pasha (@PashaNag) February 22, 2022
pic.twitter.com/JxSyvUuNg9
— Sayyad Nag Pasha (@PashaNag) February 22, 2022