సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోలింగ్ మరింతగా బాధపెట్టేదంటూ టీమ్ ఇండియా క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు యజువేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సూ*సైడ్ చేసుకునేవాడిని. అవే ఆలోచనలు వేధిస్తుండేవి. సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోలింగ్ మరింతగా బాధపెట్టేదంటూ టీమ్ ఇండియా క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు యజువేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భార్య ధనుశ్రీ వర్మతో విడాకుల అనంతరం ఎట్టకేలకు చాహల్ నోరు విప్పాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చ్ 30న బోంబే హైకోర్టు యజువేంద్ర చాహల్ వర్సెస్ ధనుశ్రీ వర్మలకు విడాకులు మంజూరు చేసిన తరువాత చాలా కాలానికి టీమ్ ఇండియా క్రికెటర్, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ నోరు విప్పి సంచలన విషయాలు వెల్లడించాడు. ధనుశ్రీ వర్మతో పెళ్లయినప్పటి నుంచి సూసైడ్ ఆలోచనలు వేదిస్తున్నాయంటూ చాహల్ సంచలన రేపాడు. ఓ పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో యజువేంద్ర చాహల్ ఈ సంచలన అంశాలు వెల్లడించాడు. ధనుశ్రీ వర్మతో వివాహ బందం, విడాకులు ఇతర విషయాల్లో తనపై వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించాడు. తీవ్రమైన డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకోవాలన్పించేదని చెప్పుకొచ్చాడు. అందుకే కొద్దికాలం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నానన్నాడు. 2024-202 డిసెంబర్-జనవరిలో విజయ్ హజారే ట్రోఫీకు ఆడలేదన్నాడు.
నేను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. చాలా ఆందోళనగా ఉండేది. సోషల్ మీడియాలో నాపై చాలా విమర్శలు వచ్చేవి. దాంతో వణికిపోయేవాడిని. గదిలో ఏసీ ఉన్నా చెమటలు పట్టేవి. ఓ దశలో సూసైడ్ చేసుకోవాలని అన్పించేది. తన భార్య ధనుశ్రీతో ఎందుకు విడిపోవల్సి వచ్చిందో కారణం చెప్పాడు. తమ వివాహం చివరి వరకూ సరిగ్గా సాగలేదన్నాడు. చాలా అంచనాలతో పెళ్లి చేసుకున్నామని, అయితే క్రికెట్ కమిట్‌మెంట్స్ కారణంగా తన భార్యతో ఎక్కువ సమయం గడపలేకపోయానన్నాడు. రిలేషన్ షిప్ అనేది ఓ రాజీ లాంటిది. ఒకరికి కోపమొస్తే మరొకరు సర్దుకుపోవాలి. ఒక్కోసారి ఇద్దరి మనస్తత్వాలు సరిపడవు. నేను ఇండియాకు ఆడుతుంటే తాను తన పనిచేసుకునేది. ఎక్కువగా కలుసుకునేవాళ్లం కాదు. అలా 1-2 ఏళ్లు గడిచిపోయింది. ప్రతి ఒక్కరికి సొంత జీవితం, వ్యక్తిత్వం, లక్ష్యాలు ఉంటాయి. భాగస్వామిగా అవతలి వ్యక్తిని సపోర్ట్ చేయాలి. కాదనుకుంటే ఎక్కువకాలం ఆ బంధం కొనసాగదంటూ యజువేంద్ర చాహల్ ఆవేదన చెందాడు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
బోంబే హైకోర్టు విడాకులు మంజూరు చేసిన తరువాత ధనశ్రీ వర్మ గృహహింస, నమ్మకం గురించి వివరించే మ్యూజిక్ వీడియో లాంచ్ చేసింది. ఈ పాట విడుదల తరువాత చాహల్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. భార్యను మోసం చేశాడంటూ మీడియాలోని ఓ వర్గం నిందించింది. తనపై వస్తున్న విమర్శల్ని యజువేంద్ర చాహల్ ఖండించాడు. తన జీవితంలో ఎప్పుడూ విశ్వాసంగానే ఉన్నానని, మోసం చేయలేదని వివరణ ఇచ్చాడు. తను భార్యను ఎప్పుడూ మోసం చేయలేదన్నాడు. తాను అలాంటి వ్యక్తినే కాదన్నాడు. ఈ విషయాలు తెలియనివాళ్లే తనను నిందిస్తుంటారన్నాడు.
విడాకులు మంజూరైనప్పుడు చాలా ఆనందించానన్నాడు. కానీ కొందరు అసూయ చెందారని చెప్పుకొచ్చాడు. 3-4 నెలలు అత్యంత నరకమైన పరిస్థితిని ఎదుర్కొన్నానన్నాడు. మొత్తానికి చాలా కాలం తరువాత ధనుశ్రీ వర్మతో విడాకులు, ఇతర అంశాలపై సంచలన విషయాలు వెల్లడించిన చాహల్ మరోసారి వార్తల్లో కెక్కాడు.