మహేంద్రసింగ్ ధోని.. మూడు ఐసీసీ ట్రోఫీల్లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్. కొన్నేళ్ల పాటు ఇండియన్ క్రికెట్‌ను ఒంటిచేత్తో ఏలిన క్రికెటర్. కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ సూపర్‌స్టార్‌ను భారత కెప్టెన్‌గా చేసి మరి.. ఆటకు వీడ్కోలు పలికిన గొప్ప లీడర్. తన తర్వాత టీమిండియా నడిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా కోహ్లీని గుర్తించి.. అతని పగ్గాలు అప్పగించి.. పక్కకు తప్పుకున్నాడు. కోహ్లీకి కూడా ధోని అంటే అమితమైన ప్రేమ. ధోనిని ఒక పెద్దన్నగా భావిస్తుంటాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
అయితే.. ఇండియన్ క్రికెట్లో ధోని ఒక తిరుగులేని కింగ్‌గా ఉన్న సమయంలోనే.. అతని మాటను కాదని మరీ కోహ్లీ తన పంథాను కొనసాగించాడు. కోహ్లీ చూపించిన ఆ మొండిపట్టుదలే.. ఇప్పుడు టీమిండియాను టెస్టు క్రికెట్లో నంబర్ వన్ జట్టుగా నిలిపిందని భారత జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తన పుస్తకం ‘కోచింగ్ బిహైండ్: మై డేస్స్ విత్ ఇండియన్ టీమ్’లో పేర్కొన్నారు. ధోని-కోహ్లీ మధ్య జరిగిన సంభాషణ, ధోని.. కోహ్లీకి ఇచ్చిన సలహా, దాన్ని కోహ్లీ నిరాకరించడం, చివరికి ధోని మాట నిజమవడం.. అయినా కూడా కోహ్లీ చూపించిన తెగువే టెస్టు క్రికెట్లో ఇండియాను ఒక తిరుగులేని శక్తిగా ఎలా మార్చిందో చాలా వివరంగా తెలిపారు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2014లో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత్ ఆస్ట్రేలియా వెళ్లింది. విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 517 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్, కెప్టెన్ మైకెల్ క్లార్క్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చేలరేగగా.. ఓపెనర్ మురళీ విజయ్, పుజారా, అజింక్యా రహానే హాఫ్ సెంచరీలతో రాణించడంతో 444 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆసీస్ రెండు ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చి.. భారత్‌కు 364 పరుగుల టార్గెట్ ఇచ్చింది. అయితే.. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు టీమిండియాకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్రా కోసం కాకుండా.. గెలుపు కోసమే అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ.. ధోని మాత్రం.. ఒక్క రోజులు 360పైగా రన్స్ ఛేజ్ చేయడం గురించి కోహ్లీతో మాట్లాడుతూ.. ఆ టార్గెట్‌ను ఛేజ్ చేసే సామర్థ్యం నీకుంది. నీ గురించి మాకు తెలుసు. కానీ.. మిగతా జట్టు గురించి కూడా ఆలోచించాలి.
నువ్వు ఒక కెప్టెన్‌గా నిర్ణయం తీసుకునే సమయంలో కేవలం నీ ఒక్కడిపై నమ్మకంతో కాకుండా.. జట్టు మొత్తాన్ని, ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరిగణంలోని తీసుకుని.. ఏ నిర్ణయమైన తీసుకోవాలి. చివరి రోజు 360 పరుగులు ఛేదించేందుకు వెళ్లి.. ఆలౌట్ అవ్వడం కంటే.. డ్రా కోసం ఆడటమే ఉత్తమం అని ధోని కోహ్లీకి వివరించే ప్రయత్నం చేశాడు. కానీ.. కోహ్లీ మాత్రం ధోనికి బదులిస్తూ.. మనం ఇన్నిరోజులు దీన్ని ప్రయత్నించలేదు. ఒకసారి ప్రయత్నిస్తేనే కదా మన వల్ల అవుతుందో కాదో తెలిసేది. అందుకే ఈసారి ట్రై చేద్దాం. ఒక వేళ తక్కువ మార్జిన్‌తో మనం ఓడిపోయినా.. మన గెలిచినట్లే లెక్క అని కోహ్లీ తన నిర్ణయాన్ని ధోని ముందు ఉంచాడు.
అనుకున్నట్లు గానే టీమిండియా ఆస్ట్రేలియాపై ఎటాకింగ్ క్రికెట్ ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. 141 పరుగులు బాదాడు. అతనికి మురళీ విజయ్ సైతం తోడు నిలిచాడు. అతను 99 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒకానొక దశలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి.. విజయం వైపు సాగింది. కానీ.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ టీమిండియా ఇన్నింగ్స్‌ను అతలాకుతలం చేశాడు. 242 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత వరుసగా వికెట్లు నష్టపోయింది. లయన్ ఆ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో టీమిండియా ఓటమిని శాసించాడు.
364 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ కేవలం 48 పరుగుల తేడాతో ఓడింది. ధోని చెప్పినట్లు టీమిండియా విన్ కోసం ఆడి ఆలౌట్ అయి ఓడిపోయింది. కానీ.. భవిష్యత్తులో భారత్ టెస్టు క్రికెట్‌ను ఇదే విధంగా ఆడబోతుందనే విషయం మాత్రం మా అందరికి అప్పుడు అర్థమైపోయింది. టెస్టు క్రికెట్లో ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేందుకు కారణం అగ్రెసివ్ క్రికెట్ ఆడాలని అప్పుడు కోహ్లీ తీసుకున్న నిర్ణయమే కారణం అని శ్రీధర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ విధంగా ధోని మాటను కాదని కూడా.. కోహ్లీ.. టీమిండియా తలరాతను మార్చేశాడు. టెస్టుల్లో భారత జట్టును ఒక తిరుగులేని శక్తిగా మార్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Two legends in one frame 📘🔥#MSDhoni𓃵 #ViratKohli𓃵 #Sridhar #CricketTwitter #TeamIndia pic.twitter.com/0fm8Ntem1m
— Cric Files (@TheCricfiles) January 4, 2023