టీమిండియాకు రెండు వరల్డ్ కప్పులు అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మరోసారి నేషనల్ డ్యూటీకి ఎక్కనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ గుడ్‌బై చెప్పిన తర్వాత ఐపీఎల్లో ఆడుతూ.. తన వ్యాపారాలు చూసుకుంటున్న మిస్టర్ కూల్ సేవలను మరోసారి టీమిండియా కోసం వినియోగించుకోవాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి కోసం ఇప్పటికే ధోనితో బీసీసీఐ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయం మినహా ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఫ్లాప్ షోగా చెప్పుకోవచ్చు. అది కూడా కోహ్లీ పుణ్యామాని గెలిచాం.
ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా మన బౌలర్లు చేతులెత్తేశారు. అంతకు ముందు 2021లో స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ టీమిండియా దారుణంగా విఫలమైంది. 2019, 2015 వన్డే వరల్డ్ కప్పుల్లోనూ విఫలమైంది. 2007 తర్వాత మళ్లీ పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడలేదు. మొత్తానికి 2011 తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలువలేకపోయింది. ఈ 11 ఏళ్ల కాలంలో చాలానే ఐసీసీ ట్రోఫీలు జరిగినా.. టీమిండియా అన్నింటిలోనూ ఫెయిల్ అయింది. ఇలానే పరిస్థితి కొనసాగితే కష్టమని భావిస్తున్న బీసీసీఐ.. జట్టులో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
టీమిండియా టీ20, వన్డే వరల్డ్ కప్‌లను అందించిన కెప్టెన్ ధోనికి కీలక బాధ్యతలు అప్పగించి.. టీమిండియా వరల్డ్ కప్స్ సాధించేలా చేయాలని బీసీసీఐ కొత్త కార్యవర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఐపీఎల్ 2023 తర్వాత ధోని ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెప్పి, టీమిండియాలో కొంతమంది ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ధపెట్టి వారిని ఫియర్లెస్ క్రికెటర్లుగా మార్చే బాధ్యత ధోనికి అప్పగించేందుకు బీసీసీఐ భావిస్తోంది. అయితే.. ద్రవిడ్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను సైతం ధోనికే అప్పగించేందుకు బీసీసీఐ ఫిక్స్ అయినట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2021 కోసం ధోని.. టీమిండియా మెంటర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. కానీ.. అది అంత మంచి ఫలితాలను ఇవ్వలేదు. అయినా కూడా ధోనికి పూర్తి స్థాయిలో టీమిండియాలో కొన్ని కీలక బాధ్యతలు ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
BCCI is keen to use the experience of MS Dhoni, board might ask him to work with certain players in the T20 setup for bringing fearless attitude in ICC tournaments. (Source – The Telegraph)
— Johns. (@CricCrazyJohns) November 15, 2022