శ్రీలకం టూర్ ఆఫ్ ఇండియా-2022లో టీ20 సిరీస్ వైట్ వాష్ చేసిన ఇండియా.. అదే జోష్ తో టెస్టును కూడా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ ను 574/8 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. తొలి ఇన్నింగ్స్ జడ్డూ అద్భుతంగా రాణించాడు. ఈ ఇన్నింగ్స్ లో 228 బంతుల్లో 175(17*4-3*) పరుగులు నాటౌట్ గా నిలిచాడు. మార్చి 4 ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే జడేజా తను సెంచరీ చేసిన తర్వాత షేన్ వార్న్ ను తలుచుకున్నాడు. ఒకింత భావోద్వేగానికి గురైనట్లు కూడా కనిపించాడు.
Jaddu brings up his 2nd Test CENTURY 👏#INDvSL #RavindraJadeja @imjadejahttps://t.co/4ZWZuwDFwV pic.twitter.com/Qrf5rhPD4u
— Ravindra jadeja fan😎 (@Jadeja123457) March 5, 2022
షేన్ వార్న్- జడేజాకు మధ్య మంచి అనుబంధం ఉండేది. షేన్ వార్న్- జడేజాకు రాక్ స్టార్ అనే పేరు పెట్టాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో షేన్ వార్న్ మొదటిసారి జడేజాను చూశాడు. ఆ సమయంలో జడేజాను పిలిచి హర్షా భోగ్లోతో ఈ కుర్రాడు రాక్ స్టార్ అంటూ అభినందించాడు. ఆ తర్వాత జడేజా గురించి చాలాసార్లు షేన్ వార్న్ హర్షా భోగ్లోతో చర్చించాడు కూడా. ఆ విషయాన్ని స్వయంగా హర్షా భోగ్లోనే ట్వీట్ చేశాడు. జడేజా సెంచరీ తర్వాత భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జడేజా- షేర్న్ వార్న్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
He loved you Jaddu. Remember the time in ’08 at the DY Patil Stadium….He called you over and said to me “This kid is a rockstar”. We chatted more than once about you and he was very fond of you and of Yusuf. https://t.co/P9MUWARLyo
— Harsha Bhogle (@bhogleharsha) March 4, 2022