తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముందుగా తెలంగాణా చుట్టు ఉన్న రాష్ట్రలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈక్రమంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేఫథ్యంలోనే త్వరలో ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్ రానుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాక ఇటీవలే జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే దేశ రాజకీయలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తరువాత ఆ పార్టీ కార్యకలాపాలు విస్తరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈక్రమంలోనే పొరుగు రాష్ట్రమైన ఏపీపై కూడా కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఏపీలో పలువురు నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు గులాబీ బాస్. తాజాగా బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీఆర్ఎస్ వార్తా పత్రిక త్వరలో రాబోతుంది. దీనికి పేరును కూడా ఖరారు చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నాయకులతో భేటీ అవుతూ బిజీ బీజీగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో చక్రం తిప్పేలా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే మొదట తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలపై గులాబీ అధినేత దృష్టి పెట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకలాపాలకు కార్యాలయాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అంతేకాక ఆయా రాష్ట్రాల బాధ్యతలను పలువురికి అప్పగిస్తున్నారు.
ఇలా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న బీఆర్ఎస్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ లో బీఆర్ఎస్ న్యూస్ పేపర్ త్వరలో రాబోతుందని సమాచారం. దీనికి పేరును కూడా ఖరారు చేశారని టాక్. ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేరుతో త్వరలోనే న్యూస్ పేపర్ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించనుంది. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను ఏపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ న్యూస్ పేపర్ ను ప్రారంభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.