ఇటీవల ప్రేక్షకులు సినిమాలను చూసే విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. థియేట్రికల్ సినిమాలు, ఓటిటి సినిమాలంటూ వేరు చేసి చూస్తున్నారు. అంతేగాక హీరోల క్రేజ్, స్టార్డమ్ పరంగా కాకుండా.. కంటెంట్ ప్రధానంగా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే.. ఎంత పెద్ద సినిమాలైనా థియేటర్లలో రిలీజైన కొద్ది రోజులకే ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటిటి సినిమాలు/వెబ్ సిరీస్ లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో థియేటర్స్ లో రిలీజై హిట్ అయిన సినిమాలు ఉంటాయి. కానీ.. థియేటర్స్ లో మిస్ అయినా ఓటిటిలో మిస్ అవ్వకూడని కొన్ని సినిమాలుంటాయి. అలాంటి సినిమాలు రీసెంట్ గా ఏమేమి వచ్చాయో చూద్దాం!