కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ తన నటనతో కన్నడలో ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా పునీత్ రాజ్ కుమార్ హార్ట్ ఎటాక్ కి గురయ్యారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ని బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Saddened to hear about the passing away of #PuneethRajkumar . Warm , and humble, his passing away is a great blow to Indian cinema. May his soul attain sadgati. Om Shanti. pic.twitter.com/YywkotiWqC
— Virender Sehwag (@virendersehwag) October 29, 2021
పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త కలచి వేసిందంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వట్టర్ వేదికగా స్పందించాడు. ‘పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త కలచి వేసింది. ఎంతో మంచి వ్యక్తి. ఆయన మృతి భారత సినిమా రంగానికి తీరని లోటును మిగిల్చింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
Jai Shivanna😍 age is just a number for him.#Bhajarangi2 Pre release event@TheNameIsYash #KGFChapter2 . pic.twitter.com/x61LsFqfLj
— Adheera🗯️ (@AdheeraSukka) October 26, 2021