న్యూ ఢిల్లీ- దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలుసు. అధికారిక ప్రోగ్రామ్స్ లో నిత్యం తలమునకలై ఉండే ప్రధాని, సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటారు. తన వ్యక్తిగత, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిని ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకుంటారు మోదీ. ఈ క్రమంలో ఓ 10 ఏళ్ల చిన్నారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించిన ప్రధాని, బుధవారం పార్లమెంట్లో ఆమెతో సరదాగా కబుర్లు చెప్పారు. ఇంకేముంది ఆ చిన్నారి అనందానికి అవుధుల్లేవని చెప్పాలి.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ నియోజకవర్గం ఎంపీ సుజెయ్ వీకే పాటిల్ పదేళ్ల కూతురు అనీషా పాటిల్. ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని ఆమె చాలా సార్లు తండ్రిని కోరింది. ప్రధాని బీజీగా ఉంటారని, అపాయింట్మెంట్ దొరకడం కష్టమని పాటిల్ కూతురికి చెబుతూ వస్తున్నారు. విసిగిపోయిన అనీషా తండ్రి లాప్ టాప్ నుంచి ప్రధానికి స్వయంగా ఈమెయిల్ పంపింది. సార్, నా పేరు అనీషా.. మీమ్మల్ని కలవాలని ఉంది.. అపాయింటెమెంట్ ఇవ్వండి.. అని విజ్ఞప్తి చేసింది.
చిన్నారి ఈ మెయిల్ చూసిన ప్రధాని ఆమెకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. పరిగెత్తుకుంటూ రా తల్లీ.. అంటూ రిప్లై ఇచ్చారు. బుధవారం ఎంపీ పాటిల్ తన గదిలోకి అడుగుపెట్టిన వెంటనే అనీషా ఏది అని ప్రధాని అడిగారు. ఇక మోదీని కలిసిన ఆ చిన్నారి ఆనందం అంతా ఇంతా కాదు. ప్రధానిని ఆమె ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. మీ ఆఫీసు ఎంత పెద్దగా ఉందో.. మీరు రోజంతా ఇక్కడే ఉంటారా.. అని చాలానే అడిగేసింది.
మోదీ కూడా అంతే ఎంతో ఓపికగా చిన్నారి అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పారు. ఐతే చివరలో ఆ పాప అడిగిన ప్రశ్నకు ప్రదాని ముసి ముసి నవ్వులు నవ్వారు. సార్.. మీరు గుజరాత్ వారేనటకదా.. మరి భారతదేశానికి ప్రెసిడెంట్ ఎప్పుడు అవుతారు.. అని బాలిక అమాయకంగా అడగడంతో ప్రధానితో పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
10-year-old Anisha arrives in Parliament to meet PM Modi, PM laughs at baby girl’s questions https://t.co/WiPrWP3Zn7 #narendramodi #anishavikhepatil #narendramodi #pmmodimetanisha
— News track English (@newstrack_eng) August 12, 2021