మనిషి జీవితంలో చావుపుట్టుకలు అనేవి తప్పవు. పుట్టిన ప్రతి మనిషి.. తప్పకుండా మరణిస్తాడు. ఈ విషయం అందరికి తెలుసు. అయినా సరే.. పుట్టుక మీద ఉన్నంత తీపి, ఆశ చావు పట్ల ఉండవు. పైగా మరణం అంటే అంతులేని భయం. అయితే వయసు మీద పడి మృతి చెందడం, ఏదో అనారోగ్యం కారణంగా మృతి చెందితే.. ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుంటాం. కానీ అంతవరకు ఎంతో హుషురుగా ఉండి.. సంతోషంగా ఆడిపాడిన వాళ్లు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందితే.. ఆ షాక్ నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. ఇక ఈ మధ్యకాలంలో.. ఇలా ఉన్నట్లుండి గుండెపోటుకు గురయ్యి.. హఠాత్తుగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నవ వధువు.. వరుడి మెడలో మాల వేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. దాంతో పెళ్లి మంటపంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్, లక్నోలో చోటు చేసుకుంది. భద్వానా గ్రామానికి చెందిన రాజ్‌పాల్ అనే వ్యక్తికి శివాంగి శర్మ అనే కుమార్తె ఉంది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఈ క్రమంలో రాజ్‌పాల్.. కుమార్తెకు.. వివేక్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఇక అంగరంగ వైభవంగా వారి వివాహ వేడుక నిర్వహించారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో.. వేడుకగా వీరి వివాహం జరిగింది. ఇక పెళ్లి తంతులో భాగంగా.. వివేక్.. శివాంగి మెడలో వరమాల వేశాడు. ఆ తర్వాత వధువు వంతు. ఇక శివాంగి.. వివేక్ మెడలో వరమాల వేయడానికి ముందుకు వంగి.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది.
ఆ సంఘటనతో మండపంలో ఉన్నవారు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని.. శివాంగిని తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే శివాంగి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయ్యో.. వివాహం చేసుకుని.. నిండు నూరేళ్లు.. పిల్లాపాపాలతో సంతోషంగా గడపాల్సిన కుమార్తె.. ఇలా పెళ్లి మంటపంలోనే మృతి చెందడం ఏంటని గుండెలు పగిలేలా ఏడ్చారు. అయ్యో తల్లి.. పెళ్లి మంటపం నుంచి.. కాటికి వెళ్తున్నావా.. ఇందుకేనా.. నీకు వివాహం నిశ్చయం చేసింది.. అంటూ ఏడ్చారు. ఈ సంఘటనతో.. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Heart-breaking news coming in from Lucknow, Uttar Pradesh.
Daughter of Rajpal of Bhadwana village, Shivangi Sharma, the 21-year-old bride, collapsed during her wedding in Malihabad and dies of cardiac arrest. pic.twitter.com/y5eWHrAmbM
— Sanjay (@sanjaykumarpv) December 4, 2022