ఓ సినిమాలో సన్నివేశం….ఓయ్ పెళ్లికాని ప్రసాద్! అని పిలుస్తే అక్కడ ఆ పేరు ఉన్న వాళ్లందురు లేస్తారు. అప్పుడు మిమ్మల్ని కాదయ్యా పెళ్లి కానీ ప్రసాద్ ను పిలుస్తున్నా అనే సరికి ఆ పెళ్లికాని ప్రసాద్ కు కోపం వస్తుంది. అదే సమయంలో పెళ్లి కావటంలేదని బాధ పడతాడు ఆ ప్రసాద్. అది ఆ సినిమాలో ఒక్కప్రసాదు బాధే..కానీ నిజజీవితంలో ఓ ప్రాంతంలో వేలల్లో పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు. మరి అది ఎక్కడ? అంతమందికి వివాహం కాకపోవడటానికి కారణాలు ఏంటి?
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో పెళ్లికాని యువకుల సంఖ్య అధికంగా ఉంది. రాష్ర్టంలో 30-40 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఇంకా పెళ్లి కానీ బ్రాహ్మణ యువకులు సుమారు 40వేల వరకు ఉంటారని తంబ్రాస్ సంఘ అధ్యక్షుడు నారాయణ్ తెలిపారు. వారి పెళ్లిల్లో కోసం తమిళనాడు బ్రాహ్మణ అసోషియేషన్(తంబ్రాస్) ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇక్కడ పెళ్లికాని యువకులకు ఉత్తరాదిన ఇదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను వెతికే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి ఓ తమిళ మ్యాగజైన్ లో ఆ సంఘం అధ్యక్షుడు నారాయణ్ బహిరంగ ప్రకటన ఇచ్చారు.
తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గంలో 10 మంది అబ్బాయిలకు ఆరుగురు అమ్మాయిలు మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వారు వివాహాలు కాక బ్రహ్మచారిలాగ మిగిలిపోతున్నారు. అందుకే ఉత్తరాది ప్రాంతాలైన లక్నో, దిల్లీ,పాట్నా వంటి వాటితో పాటు మరికొన్ని ఇతర ప్రాంతాల్లో తమ సమన్వయకర్తలను నియమించుకోని పెళ్లి సంబంధించిన వివారలు తెలుసుకుంటామని తెలిపారు. బ్రాహ్మణ సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు.
తమిళనాడు రాష్ర్టంలోని వివాహాల గురించి కొందరు బ్రాహ్మణులు తమ అభిప్రాయాలను ‘పీటీఐ’ వార్త సంస్థతో పంచుకున్నారు . వివాహ వయస్సు వచ్చిన ఆడపిల్లలు లేకపోడంతో చాలమంది యువకులు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారని విద్యావేత్త పరమేశ్వరన్ అన్నారు. ఇదే సమయంలో కొందరు పెళ్లి కొడుకు తల్లిదండ్రుల వైఖరిలో మార్పులు రావల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. కొందరు భారీ ఖర్చులతో పెళ్లిలు జరిపించాలని అనుకుంటారు. అయితే అది అమ్మాయిల కుటుంబాల వారికి ఆర్థిక భారం కావచ్చు. అలాంటి వాటి వల్ల వారు వెనక్కి వెళ్తారు. రెండు, మూడ్రోజుల పాటు జరిగే ఈ వివాహ తంతుకు సుమారు 12-15 లక్షలు ఖర్చు అవుతుంది.
ఇది కొందరు భరించిన, మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిల తల్లిదండ్రులకు పెనుభారం అవుతుంది. అబ్బాయిల తల్లిదండ్రులు ఇలాంటి భారీ అంచనాలు పక్కన పెడితే ఈ రాష్ట్రంలోనే అమ్మాయిలు దొరుకుతారు అని పేర్కొన్నారు. తమిళ-తెలుగు బ్రాహణ్మల వివాహాలు కన్నడ బ్రాహ్మణులతో ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయని అజయ్ అనే పెళ్లి కావలనసి యువకుడు తెలిపాడు. ఉత్తరాది బ్రాహ్మణులతో సైతం పెద్దలు కుదిర్చిన వివాహాలు జరగటం ఇటీవల కాలంలో చూస్తున్నామని పేర్కొన్నారు. అన్ని సాంప్రదాయాలు ఒకప్పుడు జరిగేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని అనుకున్నట్లు కావని సర్ధుకోని పోవాలని చెప్పారు. ఆ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు అక్కడి బ్రాహ్మణ కుటుంబ పెద్దలు. విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.