సాధారణంగా అందరు ఒక డ్యూటీ చేసి ఇంటి వచ్చే సరికే అలసి పోతుంటారు. కాస్త సమయం ఉంటే విశ్రాంతి తీసుకుంటారు. ఇక ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు మధ్యలో నిల్చుని ట్రాఫిక్ నియంత్రణ చేయాలి. అలా డ్యూటీ టైమ్ అయిపోయే సరికి వారికి ఓపిక నశిస్తుంది. కానీ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఫుట్ పాత్ పై ఉండే బాలుడుకి చదువు చెబుతున్నాడు. ఓ నిరుపేద తల్లికిచ్చిన మాట కోసం.. ఆమె కొడుకు ట్యూషన్ చెబుతున్నాడు. డ్యూటీ అయిపోగానే బెత్తం పట్టుకోని టీచర్ లా మారిపోతాడు. ఈయనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తాలోని సౌత్ ఈస్ట్ ప్రాంతంలో సార్జింట్ ప్రకాశ్ ఘోష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. అతడు నిత్యం విధులు నిర్వహించే ప్రాంతంలో ఓ మహిళ రోడ్డుపై ఆహార పదార్థాలను విక్రయిస్తుంది. ఇల్లు లేకపోవడంతో ఫుట్ పాత్ పైనే చిన్న గూడు వేసుకుని కొడుకుతో కలసి ఉంటుంది. కొడుకును స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంది. కొడుకు చదువుపై సరిగ్గా శ్రద్దపెట్టలేకపోవడంతో చాలా బాధపడుతుంది. ట్యూషన్ కి పంపిదామా అంటే అంత స్థోమత లేదు. ఈ క్రమంలో ఆ బాధను చూసిన అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ప్రకాశ్ అడిగి తెలుసుకున్నాడు. చదువు తాను చెప్తానని ఆ తల్లి కి మాటిచ్చాడు.
బాలుడు తల్లికి ఇచ్చిన మాట ప్రకారం.. రోజూ డ్యూటీ అయిపోగానే, ప్రకాశ్ ఘోష్ నేరుగా ఆ బాలుడి వద్దకు వెళ్తాడు. స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్ చూసి చేయిస్తాడు. ఓ ప్లాస్టిక్ కవర్‌పై బాలుడు పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు పెట్టుకొని కూర్చొని ఉండగా, చేతిలో కట్టెపట్టుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ చదివిస్తూ ఉండగా, ఎవరో ఫొటో తీసి, సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో ఆ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి.. ట్రాఫిక్ పోలీస్ చేసిన ఈ మంచిపని పై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.