ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ లో సభ్యులుగా ఉన్న వారికి ఇది బిగ్ అలర్ట్. డిసెంబరు 31లోగా EPFO ఖాతాదారులు రెండు అతి ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంది. ఒకటి మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్ ను జత చేయడం. రెండు మీ పీఎఫ్ ఖాతాకు నామినీని ఎన్ రోల్ చేయడం. ఈ రెండు పనులు చేయకపోతే ఖాతాదారులు ఎంతో నష్టపోతారంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.
ईपीएफ सदस्य मौजूदा ईपीएफ/ईपीएस नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/ZvJjdnCWde
— EPFO (@socialepfo) December 16, 2021
ఆధార్ ను అనుసంధానం చేసేందుకు EPFO చాలాసార్లు గడువు పొడిగించింది. అయినా కూడా చాలా మంది ఇంకా తమ ఆధార్ ను జత చేయలేదని తెలుస్తోంది. ఇదే చివరి అవకాశమని.. ఈసారి మాత్రం ఆ గడువు పొడిగించేలా కనిపించడం లేదని చెబుతున్నారు. సంస్థ కంట్రిబ్యూషన్ నిలిచిపోకుండా ఉండాలంటే ఆధార్ అనుసంధానించడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేసిన వారు తప్పకుండా UAN పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
File e-Nomination today online through UAN, to ensure #SocialSecurity for your family/nominee.
अपने परिवार/नामित व्यक्ति के लिए सामाजिक सुरक्षा सुनिश्चित करने के लिए यूएएन के माध्यम से आज ही ई-नामांकन ऑनलाइन फाइल करें।#EPFO #PF #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/Arufe7fWAM
— EPFO (@socialepfo) December 16, 2021
ఇంకో అతి ముఖ్యమైన పని.. మీ పీఎఫ్ ఖాతాకు నామినీని ఎన్ రోల్ చేయడం. ఇలా చేయకపోతే చాలా బెనిఫిట్స్ కోల్పోతారంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వచ్చే బీమా ప్రయోజనం పొందాలన్నా, ఆన్‌లైన్‌లో పెన్షన్ క్లెయిమ్ నమోదు చేసుకోవాలన్నా ఈ-నామినేషన్ తప్పనిసరి. అందుకే తప్పకుండా ఈ డిసెంబరు 31లోపు ఈ నామినేషన్ దాఖలు చేయాలని సూచిస్తున్నారు. మీ EPFO ఖాతాకు ఆధార్ లింక్ చేశారా? ఈ నామినేషన్ దాఖలు చేశారా? మీరు ఇప్పటికే ఈ రెండు పనులు చేసుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
EPS’95 Pensioners can now submit Life Certificate at any time which will be valid for 1 year from date of submission.
EPS’95 पेंशनभोक्ता अब किसी भी समय जीवन प्रमाण पत्र जमा कर सकते हैं जो जमा करने की तारीख से 1 वर्ष के लिए वैध होगा।#EPFO #EPS95 #Pension pic.twitter.com/EfwJez0O75
— EPFO (@socialepfo) December 10, 2021