ఇటీవల శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. 1948 లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సామాత్రి కొరత, ప్రాథమిక వస్తువల ధరలు భారీగా పెరగడం లాంటి సమస్యలు తలెత్తాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన తమ దేశానికి నిధులు సేకరించడానికి స్టేటన్ ఐలాండ్ లో మిస్ శ్రీలంక పోటీల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పోటీల ద్వారా వచ్చే నిధులు దేశంలోని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
అమెరికాలో ఉన్న స్టేటన్ ఐలాండ్ లో ఎక్కువ శాతం శ్రీలంక ప్రాంతానికి చెందినవారే ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ తొలిసారిగా మిస్ శ్రీలంక అందాల పోటీలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో కొంత మంది అబ్బాయిలు, అమ్మాయిల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసన తర్వాత పెద్ద ఎత్తు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో చెలరేగిన గొడవ ఇరు వర్గాలు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. అమ్మాయిలు, అబ్బాయిలు పిడి గుద్దులు గుద్దుకుంటూ గొడవకు దిగారు. ఈ ఘర్షణలో అక్కడ ఫర్నీచర్ కూడా ధ్వంసం అయ్యింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ గొడవకు గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘర్షణకు పాల్పపడిన వారిని అరెస్టు చేశారు. ఈ గొడవలో మిస్ శ్రీలంక పోటీలో పాల్గొన్న పద్నాలు మంది కంటిస్టెంట్లు లేరని నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ సంవత్సరం మిస్ శ్రీలంక లైటిల్ ని ఏంజెలియా గుణశేఖర గెల్చుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో శ్రీలంక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ప్రజంచలో చిన్న చూపు చూస్తున్నారంటే.. ఇలాంటి దిగజారుడు పనులు చేస్తూ అమెరికాలో శ్రీలంక పరువు తీస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Miss Sri Lanka New York after party. 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️👊🤛 pic.twitter.com/VIG09wgSPx
— Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022
Miss Sri Lanka New York after party – video 2 pic.twitter.com/sp94xPe4lK
— Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022