దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈసారి ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్, ఎన్నిక తేదీ వివరాలు ఇలా ఉన్నాయి.
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కన్ రాజీనామా నేపధ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీన విడుదల కానుంది.
ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్
ఆగస్టు 7 నోటిఫికేషన్ విడుదల
ఆగస్టు 21 నామినేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ
ఆగస్టు 22 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ
సెప్టెంబర్ 9 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్, కౌంటింగ్
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది
రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ ప్రకారం జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఎన్నికలో నిలిచిన అభ్యర్దులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు. ఉప రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్ధి భారతీయ పౌరుడై ఉండి 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఉండాలి. ఎలాంటి లాభదాయకమైన పదవిలో ఉండకూడదు.