ప్రముఖ తమిళ హీరో ధనుష్ చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ ఇంటి కట్టుకోవటానికి ఓ బలమైన కారణం ఉందట. రజినీకాంత్‌తో విభేదాల కారణంగా ఈ ఇళ్లు కట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ధనుష్ తన తల్లిదండ్రులకోసం చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఓ పెద్ద ఇల్లు కట్టించారన్న సంగతి తెలిసిందే. ఈ ఇంటి విలువ అక్షరాలా 150 కోట్ల రూపాయల పైమాటేనట. అయితే, ధనుష్ హఠాత్తుగా ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవటానికి చాలా పెద్ద కారణమే ఉందట. రజినీకాంత్‌తో వ్యక్తిగత వివాదం కారణంగానే ధనుష్ ఈ ఇంటిని నిర్మించారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రచారం గట్టిగా జరుగుతోంది. దీనిపై చెన్నైకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘‘ గతంలో రజినీకాంత్ ధనుష్ తల్లిదండ్రుల్ని అవమానించారట. అది కూడా పోయస్ గార్డెన్‌లోని రజినీ ఇంట్లో ఈ సంఘటన జరిగిందట. అందుకే ధనుష్ రజినీ ఇంటి పక్కన పోయస్ గార్డెన్‌లో ఇళ్లు కట్టుకున్నారట. రజినీకాంత్‌పై రివేంజ్ తీర్చుకోవటానికే ఈ ఇల్లు కట్టినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే. ధనుష్ ఆ ఇల్లు కట్టుకోవటానికి అది కారణమని భావించటం మూర్ఖత్వం’’ అని అన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే ఈ ఇంట్లోకి ధనుష్ కుటుంబం ప్రవేశించింది. హిందూ సంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధనుష్-ఐశ్యర్య విడిపోక ముందు ఈ ఇంటి నిర్మాణం ప్రారంభమైందట. అప్పుడు ఆ ఇద్దరూ అక్కడే ఉండాలని అనుకున్నారట. విడిపోవటంతో ఇక, ఆ ఇంటిని ధనుష్ తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చారంట.
ఈ విధంగా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను తెలియబరిచారంట. కాగా, ధనుష్- సంయుక్త జంటగా నటించిన సార్ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఇటు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. సార్ సినిమా ధనుష్ మొదటి తెలుగు సినిమా కావటం విశేషం. మరి, రజినీకాంత్‌తో వ్యక్తిగత వివాదం వల్లే ధనుష్ ఈ ఇళ్లు కట్టుకున్నారన్న తప్పుడు ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
மனிதன் என்பவன்
தெய்வம் ஆகலாம்..நன்றி சார்..😊🙏🏻
2023’s Best Moment ❤️ Thank you @dhanushkraja #SIR !! #Mahashivratri special time with #Dhanush sir❤️💙 🙏 #vaathi pic.twitter.com/Um51eFa3iw
— B.RAJA (@B_RajaAIDFC) February 20, 2023