సినిమా ఇండస్ట్రీలో క్రేజ్, స్టార్డమ్ వచ్చే వరకు ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొంత ఎన్ని సంవత్సరాలు కష్టపడినా స్టార్ హోదా రాదు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వందల కోట్ల బడ్జెట్‌తో వేల కోట్ల బిజినెస్‌తో.. మన టాలీవుడ్లో అంతెందుకు సౌత్‌లో ఎవరికీ సాధ్యం కానీ క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘రాధే శ్యామ్’ కి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం బాంబేలో జరుగుతున్న ‘ఆదిపురుష్’ షూట్లో పాల్గొంటున్నారు. ‘సలార్’ కూడా కొంత పోర్షన్ కంప్లీట్ అయ్యింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రాజెక్ట్ – K’ (వర్కింగ్ టైటిల్) కూడా స్టార్ట్ అయిపోయింది. తాజాగా తన 25వ సినిమాను ఆయన ఎవరితో .. ఎప్పుడు చేయనున్నాడు? అనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది.
ఇదీ చదవండి : ఎవరీ ప్రీతమ్ జుకల్కర్.. సమంతతో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది?
ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో 25వ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఈ నెల 7వ తేదీన రానుంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడ్ మైథాలజీ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ లాంటి హీరోతో ‘అర్జున్ రెడ్డి’ మూవీ తెరకెక్కించి గొప్ప హైక్ క్రియేట్ చేశారు సందీప్ వంగా. అప్పట్లో ఆయన తదుపరి చిత్రం ప్రభాస్ తో ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ కొంత గ్యాప్ వచ్చింది. తాజాగా సందీప్ వంగాతో ప్రభాస్ చిత్రం అనగానే ఫ్యాన్స్ లో బీభత్సమైన అంచనాలు నెలకొంటున్నాయి.
#India’s biggest superstar #Prabhas 25th film is around the corner.
A source reveals that,”Prabhas 25 Movie’s story is going to be entirely different from his other movies of the past
The worldwide Prabhas fans ll be more than happy to hear the announcement on “October 7th 2021” pic.twitter.com/BIc5Gy9BGo— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 4, 2021