ప్రముఖ హీరోయిన్ సమంత మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మైయోసైటిస్ అనే యాంటీ ఇమ్యూన్ డిసీజ్‌తో బాధపడుతున్న ఆమె గత కొన్ని నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. శనివారం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే సమంత అనారోగ్యంపై ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. సమంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అఖిల్ కూడా “అందరి ప్రేమ, స్ట్రెంత్ నీకే డియర్ సామ్” అని పేరొన్నాడు.
వీరితో పాటు హన్సిక, కృతిసనన్, రష్మిక, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, డింపుల్ హయాతీ, మంచు లక్ష్మి, శ్రియ, నందిని రెడ్డి, కొణిదెల సుశ్మిత, దివ్య స్పందన, డిజైనర్ జుకల్కర్ స్పందించారు. తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సమంత అనారోగ్యంపై తన ట్విటర్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ‘‘ మన జీవితంలోకి ఒడిదుడుకులు తరచుగా వస్తూ ఉంటాయి. వాటి వల్ల మన మానసిక స్థైర్యం ఏంటో మనకు తెలుస్తుంది. నువ్వు మానసిక స్థైర్యం కలిగిన ఓ అద్భుతమైన అమ్మాయివి. అతి త్వరలో ఈ ఛాలెంజ్‌నుంచి కూడా బయటపడగలవని నేను భావిస్తున్నాను. నువ్వు ధైర్యంగా.. నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ సమంతతో నాకు నేరుగా పరిచయం లేదు. ఆమెకు మైయోసైటిస్ ఉందని తెలిసి నాకెంతో బాధ కలిగింది. ఆమె దీన్నుంచి అత్యంత త్వరగా కోలుకోవాలని, గతంలో కంటే మరింత ధృడంగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జెనరేషన్‌లో ఉన్న గొప్ప నటుల్లో సమంత ఒకరు. ఆమెను మరిన్ని గొప్ప పాత్రలలో అభిమానులు చూడాలని నేను కోరుకుంటున్నాను. అభిమానుల ప్రేమ, అభిమానమే ఆమెను దీన్నుంచి బయటపడేస్తుంది’’ అని పేర్కొన్నారు.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022