గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒక్క సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అలా అని ఏదో భారీ బడ్జెట్ తీసిన మూవీ కాదది. జస్ట్ 15 కోట్లతో తీస్తే ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆ నంబర్ ని ఇంకా పెంచుకుంటూనే ఉంది. ఇకపోతే ఈ సినిమా చూడటానికి చాలా నార్మల్ గా అనిపిస్తుంది కానీ ప్రేక్షకులకు మాత్రం మంచి కిక్ ఇచ్చింది. దీంతో రిపీట్ షోలు వేస్తున్నారు. ఈ మూవీ కన్నడలోనే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కాంతార’ సినిమా తొలుత కర్ణాటకలో మాత్రమే విడుదలైంది. అయితే వేరే చోట్ల మౌత్ టాక్ వల్ల హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో దక్షిణాదిలోని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ డబ్ చేశారు. అలా ఈ సినిమా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేసింది. ఇక హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టిని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. రైటర్ గా ఎన్నో కష్టాలు పడి డైరెక్టర్ గా కన్నడలో మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘కాంతార’ సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమ్ సంపాదించాడు.
మొన్నటికి మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్.. స్వయంగా తన ఇంటికి పిలిచి మరీ రిషభ్ శెట్టిని సన్మానించారు. ఈయనే కాదు ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్స్, రాజకీయ నాయకులు కూడా ‘కాంతార’ సినిమాను మెచ్చుకుంటున్నారు. రిషభ్ శెట్టి పనితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ఈ సినిమాతో హిట్ ఆల్ రౌండర్ అనిపించుకున్న ఇతడు.. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ని కలిశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘సినిమా-క్రికెట్ లో ద రియల్ 360’s’ అని క్యాప్షన్ తో దీన్ని పోస్ట్ చేశారు. సినిమా ప్రచారంలో భాగంగానే వీళ్లిద్దరూ కలిసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ‘కేజీఎఫ్ 2’ సినిమాని ఐపీఎల్ జరుగుతున్న టైంలో ఆర్సీబీ ప్లేయర్స్ కోసం స్పెషల్ గా షో వేసి మరీ చూపించారు. అలా కన్నడ చిత్రసీమతో ఆర్సీబీ ఫ్రాంచైజీకి మంచి బాండింగ్ ఉంది. అందులో భాగంగా కాంతార హీరోని ఏబీడీ కలిసినట్లు తెలుస్తోంది.
It’s a match.
The real 360s today of the film industry and Cricket.#Kantara @shetty_rishab @ABdeVilliers17 @RCBTweets @hombalefilms @VKiragandur @gowda_sapthami @HombaleGroup @ChaluveG @Karthik1423 @AJANEESHB @actorkishore @KantaraFilm pic.twitter.com/qHbRJAWUkX— Royal Challengers Bangalore (@RCBTweets) November 3, 2022