కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. అదే స్థాయిలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చెప్పాలంటే విశాల్ ని తెలుగు హీరోలాగే ఫ్యాన్స్ భావిస్తారు. తాను తమిళలో నటించిన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేవాడు. తనదైన నటనతో, హీరోయిజమ్ తో ఫ్యాన్స్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడు నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.. కానీ బిగ్ హిట్ అందుకోవడం లేదు. సినిమాల విషయం అలా ఉంచితే..సేవా కార్యక్రమాలు చేస్తూ విశాల్ రీయల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇక అభిమానులు ఆపదలో ఉంటే సాయం చేసేందుకు విశాల్ ఎప్పుడు ముందే ఉంటాడు. తాజాగా విశాల్ పెద్ద మనసు చాటుకున్నాడు. తన అభిమానులు చేసిన పనికి విశాల్ ఫిదా అయ్యాడు.
తమిళనాడులో సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇళయ దళపతి విజయ్ తరువాత.. ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో విశాల్ ఒకరు. ప్రస్తుతం నడిఘర్ సంఘంలో కీలక వ్యక్తిగా విశాల్ కొనసాగుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సేవ కార్యక్రమాల్లో విశాల్ బిజిబిజిగా గడుపుతుంటారు. ఆయన బాటలోనే అభిమానలు ముందుకెళ్తున్నారు. విశాల్ ప్రజా సంక్షేమ సంఘం పేరుతో ఆయన అభిమానులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవ కార్యక్రమాలు చేయడాని తమ అభిమాన హీరోనే ఆదర్శమని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ఈ విశాల్ ప్రజా సంక్షేమం పేరిట అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా తిరువళ్లూరు జిల్లాకి చెందిన విశాల్ అభిమానుల సంఘ అధ్యకుడు కన్నన్, చెన్నై పట్టణం విశాల్ అభిమానుల సంఘ అధ్యక్షుడితో కలిసి 11 పేద జంటలకు వివాహం జరిపించారు. ఈ వార్త చివరకు విశాల్ వరకు చేరింది. దీంతో తన అభిమానులు చేస్తున్న ఈ మంచి పనికి సంతోషం వ్యక్తం చేశారు. తన పేరున అభిమానులు భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయండంతో ఆయన మనస్సు కదిలింది. వారిని ప్రోత్సహించేందుకు విశాల్ ఓ గొప్ప పని చేశారు. ప్రజలకు, పేదల కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్న తన అభిమానులకు విశాల్ బంగారు చైన్లు బహుమతిగా ఇచ్చారు.
చెన్నైలో జరిగిన కార్యక్రమంలో విశాల్.. కన్నన్ తో పాటు వివిధ ప్రాంతాలకి చెందిన తన అభిమాన సంఘాల అధ్యక్షులకు కూడా బంగారపు చైన్లు బహుకరించాడు. ఈ విశాల్ పై ప్రశంసల వర్షం కురుసోన్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు విశాల్ ను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ” పేదలకు సాయం చేసేందుకు అభిమానుల ప్రోత్సహిస్తున్న విశాల్ రీల్ హీరో గా కాదు..రీయల్ హీరో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. లాఠీ అనే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంది. తుప్పరివాలన్, మార్క్ ఆటోనీ అనే సినిమా మేకింగ్ దశలో ఉన్నాయి.
Truly delighted to be part of this wonderful initiative by #Vishal_Makkal_Nala_Iyakkam pic.twitter.com/qYSxwIVs0Z
— Vishal (@VishalKOfficial) November 6, 2022
A Grand Wedding Occasion of 11 Couples,
Truly delighted to be part of this wonderful initiative by #Vishal_Makkal_Nala_Iyakkam, GB#மக்கள்பணியில்#மக்கள்நலஇயக்கம்https://t.co/g9hh7PKMhh
— Vishal (@VishalKOfficial) November 7, 2022