బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే దీపికా సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు కొన్ని సార్లు సెట్స్ లో కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఆమె హాస్పిటల్ కి వెళ్లడం, వైద్య పరీక్షలు చేయించుకుని రావడం జరుగుతుంది. దీంతో దీపికా గర్భవతి అయ్యిందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నా మధ్య ప్రాజెక్ట్ కె షూటింగ్ సినిమా షూటింగ్ కు హైదరాబాద్ వచ్చినప్పుడు.. సెట్ లో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందట. దీంతో యూనిట్ సభ్యులు ఆమెను కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్ళారని వార్తలు వచ్చాయి. గుండె వేగంగా కొట్టుకోవడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఆ వార్తల్లో నిజం లేదని, కేవలం చెకప్ కోసం వెళ్లిందని యూనిట్ సభ్యులు వెల్లడించారు. చెకప్ కోసమంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పరీక్షలే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి హాస్పిటల్ లో జాయినైనట్లు వార్తలు వస్తున్నాయి. స్వల్ప అస్వస్థతతో నిన్న రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వైద్య పరీక్షలు చేయించుకుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం వరకూ ఆమె హాస్పిటల్ లోనే ఉందని, అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బానే ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పఠాన్ సినిమా సెట్ లో కూడా కళ్ళు తిరిగి పడిపోతే, హాస్పిటల్ కి తీసుకెళ్ళారట.
అయితే ఆమె ఇలా ఎందుకు పడిపోతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్యనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. కొందరు మాత్రం గర్భవతి అయి ఉంటుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, పని ఒత్తిడి వల్లే ఆమెకు ఇలా అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ దీపికా ఇలా సెట్స్ లో కళ్ళు తిరిగి పడిపోవడం, హాస్పిటల్ కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడం.. చూస్తుంటే గర్భవతి అనే సంకేతాలు కనబడుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.