పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఆయన అభిమానులకు తీరని శోకాన్ని నింపారు. అయితే తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పార్థదేహాన్ని కడసారిగా చూసేందుకు అభిమానులంతా శుక్రవారం రాత్రి నుంచే కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.
ఇక చివరిసారిగా పునీత్ రాజ్ కుమార్ ని చూసేందుకు అభిమానులతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నటులంతా పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇంతకు ముందే బాలక్రిష్ణతో పాటు రానా ప్రభుదేవా తదితరులు కంఠీరవ స్టేడియానికి చేరుకుని పునీత్ ను కడసారి చూసి వెళ్లారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అలీ, శ్రీకాంత్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. స్టేడియంలో భారీగా కిక్కిరిసన అభిమానుల మధ్య పునీత్ పార్థీవ దేహాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే దీంతో పాటు పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను ఓదార్చారు చిరు, వెంకటేష్. ఇక చిరంజీవిని చూడగానే శివరాజ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి పునీత్ రాజ్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపాడు. ఇటీవల కాలంలోనే పునీత్ తో నేను మాట్లాడనని, పునీత్ మంచి వినయం కల్గిన నటుడని, ఆయన మరణించటం కన్నడ సినిమా పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఇక పునీత్ చిన్న వయసులోని మరణించటం చాలా బాధకరమని చిరంజీవి అన్నారు.