పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. కొన్నాళ్ల నిరీక్షణకు నటసింహం బాలకృష్ణ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్ స్టాపబుల్ షో ద్వారా తెరదింపారు. అవును.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ షోలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టాడు. మొన్నటివరకు రూమర్స్ గానే వినిపించిన వీరి కాంబినేషన్ ఎపిసోడ్ ని అనౌన్స్ చేయడమే కాకుండా.. బయటికి వచ్చిన విజువల్స్ తో ఒక్కసారిగా ఊహించని సర్ప్రైజ్ అందించారు ఆహా నిర్వాహకులు. మరి అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటే ఫ్యాన్స్ సంబరాలు మామూలుగా ఉంటాయా.. తారాస్థాయిలోనే జరుగుతున్నాయి.
ఇన్నాళ్లు బాలయ్య షోకి పవన్ కళ్యాణ్ వస్తే.. వీరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అసలు వీరి మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి? అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ క్రమంలో వీరి ఎపిసోడ్ నుండి పిక్స్ లీక్ అయినట్లుగానే.. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ – బాలయ్య మధ్య జరిగిన కొన్ని సంభాషణలు కూడా లీక్ అయ్యాయి. ఇంతకీ బాలయ్య షోలో పవన్ ఏం మాట్లాడారు? పవన్ సమాధానాలకు బాలయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు? అనే ప్రశ్నలకు ఈ లీకైన సంభాషణలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. మొదటిసారి టాక్ షోలో.. అదీ బాలయ్య షోలో పాల్గొనేసరికి పవన్ కళ్యాణ్ అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక షోలో పవన్ మాట్లాడిన సంభాషణలు ఇలా ఉన్నాయట.. “నేను మొదటగా యాక్టర్ కావాలని అనుకోలేదు. విఎఫ్ఎక్స్ సైడ్ వెళ్లేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్స్ రెండేళ్లు నేర్చుకున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చాక త్రివిక్రమ్, నేను ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ అతడు సినిమా నేను చేయలేదని తిడుతూ ఉంటాడు. ఇక పాలిటిక్స్ లోకి రావడానికి నా ప్రధాన మోటివ్ ఏంటంటే.. ఒకరు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పేనని నా అభిప్రాయం. అందుకే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీలై పాలిటిక్స్ లోకి వచ్చాను” అని చెప్పాడట.
అనంతరం పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చేసరికి బాలయ్య స్పందిస్తూ.. ‘ఇకనుండి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ఎవడైనా ఊరకుక్కతో సమానం’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య – పవన్ ల ఎపిసోడ్ టాపిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి సంక్రాంతికి పూర్తి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో! మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం అటు పవన్ ఫ్యాన్స్ కి, ఇటు నందమూరి ఫ్యాన్స్ కి మెమోరబుల్ గా నిలిచిపోనుంది. మరి పవన్ – బాలయ్య ఎపిసోడ్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
Cargo pant – Black hoddie🔥#UnstoppableWithNBK #PawanKalyan pic.twitter.com/FX6e2x2wzI
— YelleshPSPK™ (@Yelleshpspk7) December 27, 2022
anna 😍😍 @PawanKalyan pic.twitter.com/UcJISSr0fB
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) December 27, 2022