కాస్టింగ్ కౌచ్.. గత కొన్నేళ్లుగా ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అవకాశాల పేరుతో నటీమణులను, హీరోయిన్లు అయ్యేందుకు ఇండస్ట్రీకి వచ్చే వారిని లోబరుచుకుంటున్నారంటూ ఎన్నో ఆరోపణలు మరెన్నో విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మీటూ అంటూ పెద్దఎత్తున ఉద్యమం కూడా చేశారు. ఎంతో మంది హీరోయిన్లు, సపోర్టింగ్ రోల్స్ చేసే నటీమణులు తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని, అవకాశం ఇచ్చేందుకు మమ్మల్ని ఇలా అడిగారంటూ తమ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా బయట పెట్టడం చూశాం. ఇప్పుడు ప్రముఖ బుల్లితెర యాంకర్.. రాములమ్మ అలియాస్ శ్రీముఖి ఇదే అంశంపై కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
బుల్లితెర్ స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా కెరీర్ మొదట్లో అలాంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. శ్రీముఖి ఇప్పుడు ఫేమస్ యాంకర్ అని అందరికీ తెలుసు. అయితే ఆమె కెరీర్ మొదట్లో హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ఓ డైరెక్టర్ ఒప్పుకున్నాడని.. కాకపోతే అవకాశం ఇచ్చేందుకు పక్కలోకి రామన్నాడని రాములమ్మ చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు శ్రీముఖి బుల్లితెరపై సెటిల్ అవ్వడానిక అదే కారణం అని కూడా చెబుతున్నారు. అవకాశం కోసం కమిట్మెంట్ ఇవ్వాలి అంటే అలాంటి అవకాశాలు తనకు వద్దనకుని బుల్లితెరపై యాంకర్‌గా సెటిల్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఇంక శ్రీముఖి కెరీర్ విషయానికి వస్తే.. బుల్లితెరపై ఉన్న ఎంతో కొద్ది స్టార్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. ఆమె అభిమానులు అంతా ఎంతో ప్రేమగా రాములమ్మ అని పిలుచుకుంటారు. ఎన్నో అద్భుతమైన టీవీ షోలు, ఎన్నో సినిమా ఈవెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ కి శ్రీముఖి హోస్ట్ గా చేసింది. ఇప్పుడు కూడా పలు ఛానళ్లలో వివిధ షోలు చేస్తోంది. ఇంక సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లోనూ చిరంజీవిని విమానంలో ఇంటర్వ్యూ చేసింది. అవకాశాల విషయానికి వస్తే.. శ్రీముఖి చేతినిండా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంటోంది. అటు బుల్లితెర మీదే కాకుండా వెండితెర మీద కూడా కన్నేసినట్లు తెలుస్తోంది.