భార్యభర్తలు గురించి ప్రస్తావన రాగానే చిలకాగోరింకనే గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా సరే అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి భార్యభర్తలుగా మారతారు. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. జీవితాంతం పాలు నీళ్లలా కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్లే ఎవరేం చెప్పినా సరే అందులో మంచిని తీసుకుని తమ జీవితానికి అన్వయించుకుంటారు. కానీ భార్య లేదా భర్త, ఇద్దరిలో ఎవరైనా సరే పరాయి వ్యక్తి నుంచి ఆలంబన, సహచర్యం కావాలని కోరుకుంటారో అప్పుడే కుటుంబంలో కలతలు మొదలవుతాయి. అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ భర్త.. తన భార్య చేసిన పని గురించి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి దగ్గర మొరపెట్టుకున్నాడు.
అతడు ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తి. మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అందమైన భార్యతో చాలా అన్యోన్యంగా ఉంటున్నాడు. వీళ్ల దాంపత్యానికి గుర్తుగా పిల్లలు కూడా ఉన్నారు. ఇతడికి ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అతడికి పెళ్లయింది. ఓ పాప కూడా ఉంది. ఈ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరి కుటుంబం గురించి మరొకరికి బాగా తెలుసు. ఇన్నేళ్ల పాటు వీళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ బాగా కొనసాగింది. కానీ ఓ రోజు మాత్రం సదరు వ్యక్తి, జాబ్ కోసం ఆఫీస్ కు వెళ్లాడు. కానీ ఒంట్లో నలతగా అనిపించడంతో.. మధ్యాహ్నం టైంలో తిరిగి ఇంటికొచ్చేశాడు. తన భార్యతో పాటు మరో వ్యక్తి అసభ్యంగా మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. వెనక నుంచి వెళ్లి చూడగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటన కనిపించింది.
దీంతో సదరు వ్యక్తి అయోమయంలో పడిపోయాడు. ఎందుకంటే తన భార్యతో అసభ్యకర రీతిలో ఉన్నది తన ఫ్రెండే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సదరు వ్యక్తి.. ‘అందమైన జీవితం’ ప్రోగ్రాంకి కాల్ చేసి, తన బాధని వెళ్లగక్కాడు. ఏ రోజు కూడా తన భార్యపై అస్సలు అనుమానం రాలేదని ఆ వ్యక్తి చెప్పాడు. తన భార్యని చెల్లిలా భావిస్తాడనుకున్నానని.. కానీ ఇలా చేయడంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని.. లైవ్ కాల్ లో ఏడ్చినంత పనిచేశాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి అర్ధరాత్రుళ్లు మెలకువ వచ్చి నిద్రలేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన పదేపదే గుర్తొచ్చి మనసు మొత్తం ఏదోలా అయిపోతుందని కూడా చెప్పుకొచ్చాడు.
డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అడిగి ప్రశ్నకు బదులిస్తూ.. తను మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చే టైంలో వాళ్లు రూమ్ డోర్ చాలా దగ్గరికి వేసుకుని అలాంటి పొజిషన్ లో ఉన్నారని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తీస్తే వచ్చేస్తుంది అనేలా డోర్ వేసుకుని ఉన్నారని, అందువల్లే వారి మాటలు వినిపించాలని అన్నాడు. తన ఇన్నేళ్ల కాపురంలో తన భార్యకు ఇది అది అని తేడా లేకుండా ప్రతి విషయంలోనూ పూర్తిగా సహకరిస్తూ వచ్చానని, అయినా సరే ఇలా చేయడం తనని బాధించిందని చెప్పాడు. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత.. దీని గురించి తనకు మాత్రమే తెలిసినప్పటికీ, వాళ్లు మాత్రం ఎక్కువగా నటిస్తున్నారని చెప్పాడు. ఇక ఫైనల్లీ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి మాత్రం.. ‘మీ భార్యతో మాట్లాడి చూడండి’ అని సలహా ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే క్లినిక్ కి రండి అని అన్నారు.