ఐపీఎల్ 2022లో ఆర్సీబీని అదే బ్యాడ్ లక్ వెంటాడింది. అదృష్టం కలిసొచ్చి ప్లే ఆఫ్స్ కు చేరుకున్నా… బ్యాడ్ లక్ తో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇంటి ముఖం పట్టింది. జోస్ బట్లర్ వీరవిహారం చేయడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. అయితే ఈ సమయంలో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ పై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. కొందరైతే దినేష్ వల్లే ఆర్సీబీ ఓడిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. తన ఆటతో టీమిండియా జట్టులో తిరిగి స్థానం పొందిన దినేష్ కార్తీక్ ప్రస్తుతం ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. హీరోలు- జీరోలుగా మారుతారు అనడానికి దినేష్ కార్తీక్ క్లాసిక్ ఉదాహరణ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ను ఎవరూ తప్పుబట్టలేరు. జట్టుకు అవసరమైన ప్రతిసారి నేనున్నానంటూ దినేష్ కార్తీక్ ఆదుకున్నాడు. ఈ సీజన్లో డీకే 16 మ్యాచుల్లో 183 స్ట్రైక్ రేట్, 55 సగటుతో 330 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అలాంటి దినేష్ కార్తీక్ ప్రస్తుతం అతని కీపింగ్ వల్లే ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు. దినేష్ కార్తీక్ వల్లే ఆర్సీబీ ఓడిపోయిందంటూ విమర్శిస్తున్నారు.10 ఓవర్ల తర్వాత ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసి రాజస్థాన్ జట్టు ఎంతో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. విజయానికి ఇంకా 55 పరుగులు కావాలి. 11వ ఓవర్ వేసేందుకు హర్షల్ పటేల్ బాల్ అందుకున్నాడు. హర్షల్ పటేల్ వేసిన మొదటి బాల్ ని సరిగా జడ్జ్ చేయలేక పోయిన జోస్ బట్లర్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని దినేష్ కార్తీక్ చేతుల్లోకి వెళ్లింది. కానీ, బంతిని సరిగ్గా జడ్జ చేయలేకపోయిన కార్తీక్ క్యాచ్ డ్రాప్ చేశాడు.
లైఫ్ వచ్చిన తర్వాత బట్లర్ మరింత రెచ్చిపోయి.. 60 బంతుల్లో 6 సిక్సులు, 10 ఫోర్లు సాయంతో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఒకే సీజన్లో 4 సెంచరీలు చేసి కోహ్లీ రికార్డు సమం చేశాడు. బట్లర్ అవుట్ అయితే ఆర్సీబీ గెలిచేదా అంటే? ఐపీఎల్ లో ఏదైనా సాధ్యమే అంటున్నారు. డీకే ఈ సీజన్లో మొత్తం 10 క్యాచ్ లు డ్రాప్ చేయగా.. సంజూ శాంసన్ 8, పంత్ 3 క్యాచ్ డ్రాప్ లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆర్సీబీ ఓటమికి దినేష్ కార్తీక్ కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Classic Example of a Hero turning into a Vilain For RCB Fans today is Dinesh Karthik! After his failure with Bat he dropped a Straight forward Catch of Jos Buttler!#RRvsRCB#RCB#RCBvsRR#Qualifier2#RCBvRR pic.twitter.com/76YmITGCZH
— MTvalluvan (@MTvalluvan) May 27, 2022