నేటికాలంలో వివాహేతరం సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన ఇలాంటి వార్తలే వినిపిస్తోన్నాయి. పరాయి శరీరంతో కొన్ని క్షణాల సుఖం కోసం పచ్చని సంసారాన్ని బుడిద చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు పోతున్నాయి. కొందరు ఇలా తమ భాగస్వామికి తెలియకుండా పక్కవారితో సుఖం పెట్టుకుని చివరకు బెడిసి హత్య చేయడం లేదా హత్యకు గురికావడం జరుగుతుంది. వివాహేతర సంబంధంకి తాజాగా ఓ నిండు ప్రాణం బలైంది. పదేళ్లుగా కొనసాగుతున్న చీకటి బాగోతంలో వచ్చిన పరిణామాలు ఓ మనిషి హత్యకు దారి తీశాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మద్దూర శంకరపేట గ్రామంలో అల్లబోయిన గోవిందరావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసు మిస్టరీని 24గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఎంఆర్ అగ్రహారానికి చెందిన గోవిందరావు, శంకరపేట గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగించేవాడు. కొన్నేళ్లపాటు వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఇలా సాగుతున్నా వీరి చీకటి భాగోతం…సదరు మహిళ భర్తకు తెలిసింది. దీంతో గోవిందరావు.. సదరు మహిళ భర్త పెద్దల ముందు పంచాయితీ చేయించాడు.
అయినప్పటీ గోవిందరావులో మార్పు రాలేదు. గోవిందరావు..వైజాగ్ లో పనిచేస్తూ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ మహిళను వేధించేవాడు. అంతేకాక అందరిలో సదరు మహిళ భర్తను గోవిందరావు హేళనగా, అవమానకరంగా మాట్లాడేవాడు. దీనితో భరించలేకపోయిన ఆ దంపతులు గోవిందరావును చంపేయాలని భావించారు. అందుకోసం ఓ ప్రణాళికను రూపొందించారు. తన భార్యపై ఉన్న గోవిందరావుకు ఉన్న మోజు ఆస్త్రంగా ఉపయోగించి చంపేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన గోవింద రావును సదరు మహిళ ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. మాజీ ప్రియురాలే కావడంతో గోవిందరావు తెగ ఆతృతతో సదరు మహిళ ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు.
మహిళ.. ఇంటికి వచ్చే దారిలో ముందుగానే జీఐ వైరును విద్యుత్ సరఫర అయ్యేలా ముందుకుగానే ఆ భార్యభర్తలు సిద్ధం చేశారు. ఈక్రమంలో గోవిందరావు వారికి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న జీఐ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా భార్యభర్తలు నిందితులుగా తెలింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చూశారు కదా.. భక్తి భావాలు తగ్గి..శరీరాల వ్యామోహంలో పడితే చివరకు మిగిలేది బుడిదేనని, అందుకు నిదర్శనమే ఈ ఘటన అని కొందరు అభిప్రాయపడ్డుతున్నారు.