ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ తమ పాలసీదారులకు శుభవార్త చెప్పింది. తొలిసారిగా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఫలితంగా.. పాలసీదారులు ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ లో తమ పాలసీల వివరాలను పొందవచ్చు. అందుకోసం పాలసీదారుల.. 8976862090 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చేయాల్సిఉంటుంది. అంతకంటే ముందుగా ఈ సేవలకై కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ ఎలా చేసుకోవాలి? ఎలాంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐసీ పాలసీలను కొనసాగిస్తున్న కస్టమర్లు మాత్రమే ఈ వాట్సాప్ సేవలను వినియోగించుకోగలరు. ముందుగా 8976862090 నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకొని.. వాట్సాప్ లో ఆ నెంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేయాలి. ఆప్షన్స్ వస్తాయి. అందులో నుంచి కావాల్సిన సర్వీసును పొందవచ్చు. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయంటే..
LIC launches its WhatsApp Services#LIC #WhatsApp pic.twitter.com/vBO4c86xLr
— LIC India Forever (@LICIndiaForever) December 2, 2022
ఎల్ఐసీ వాట్సాప్ సేవలకు రిజిస్టర్ చేసుకునే ముందుగా.. కస్టమర్లు, పాలసీ నెంబర్, పాలసీల ఇన్స్టాల్మెంట్ ప్రీమియమ్స్, పాస్‌పోర్ట్/ పాన్ కార్డ్ స్కాన్డ్ కాపీ( సైజ్- 100కేబీ లోపల)ని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఎల్ఐసీ పోర్టల్‌లో మీ పాలసీలను యాడ్ చేసిన తర్వాత వాట్సప్ ద్వారా ఎల్ఐసీ అందిస్తున్న సేవల్ని పొందవచ్చు.