ట్విట్టర్- ఎలన్ మస్క్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు పేర్లే మారుమ్రోగుతున్నాయి. ఎట్టకేలకు మస్క్ ముందుగా చెప్పిన విధంగా ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. చేసిన తొలిరోజే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె సహా పలువురు పెద్దలకు ఉద్వాసన పలికాడు. ఆ తర్వాత ఇంక ట్విట్టర్ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు ప్రకటించాడు కూడా. అలాగే పలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో వెరిఫైడ్ బ్యాడ్జ్ కు నెలవారీ చెల్లింపులు ఉంటాయంటూ హింట్ ఇస్తున్నారు. దాదాపు నెలకు 20 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ప్రచారంలో ఉంది. గతంలోనూ ఎలన్ మస్క్ ట్విట్టర్ అందరికీ ఉచితం కాదని చెప్పిన విషయం తెలిసిందే.
రాగానే ఉద్యోగులను తొలగించిన మస్క్ ఒక కొత్త సలహాదారుడిని పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ కు ట్విట్టర్‌కు సంబంధించి టెంపరరీగా తానే సలహాలు ఇస్తున్నట్లు శ్రీరామ్ కృష్ణన్ స్వయంగా ట్వీట్ చేశారు. “ఇప్పుడు ఈ విషయం అధికారికం అయ్యింది. నేను మరికొంతమంది గొప్పవాళ్లతో కలిసి ఎలన్ మస్క్ కు తాత్కాలికంగా సహాయం చేస్తున్నాను. ఇది చాలా గొప్ప కంపెనీ అని నేను నమ్ముతున్నాను. ఇది ప్రజలపై ఎంతో గొప్ప ప్రభావం చూపగలదు. అలా జరిగేలా ఎలన్ మస్క్ చేయనున్నారు” అంటూ శ్రీరామ్ కృష్ణన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఎలన్ మస్క్ కు ఒక భారతీయుడు సలహాదారుడిగా ఉన్నాడు అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే అసలు ఎవరు ఈ శ్రీరామ్ కృష్ణన్? అనే వెతుకులాట కూడా మొదలైంది.
Now that the word is out: I’m helping out @elonmusk with Twitter temporarily with some other great people.
I ( and a16z) believe this is a hugely important company and can have great impact on the world and Elon is the person to make it happen. pic.twitter.com/weGwEp8oga
— Sriram Krishnan – sriramk.eth (@sriramk) October 30, 2022
చెన్నైలో పుట్టిపెరిగిన శ్రీరామ్ కృష్ణన్ విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్త చేశారు. 2001 నుంచి 2005 వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి డిగ్రీ పూర్తి చేసుకున్నారు. తొలుత మైక్రోసాఫ్ట్ లో విజువల స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్ గా పనిచేశారు. తర్వాత మెటా, స్నాప్ లలో ఆడియన్స్ నెట్ వర్క్, యాడ్ ప్రొడక్ట్ లు తయారు చేశారు. మరోవైపు వెంచర్ క్యాప్టలిస్ట్ గా కూడా ఎదిగారు. శ్రీరామ్ కృష్ణన్ భార్య ఆర్తి రామమూర్తి వెంచర్ క్యాపిటలిజం, క్రిప్టోకరెన్సీల వరకు అన్ని అంశాలపై చర్చలు జరిగేలా 2021 ప్రారంభంలో ఓ టాక్ షోని ప్రారంభించారు. ఆ టాక్ షోలో గెస్ట్ గా ఎలన్ మస్క్ కూడా పాల్గొన్నారు.
PS. Still very much in my day job at @a16zcrypto 🙂. If you’re a crypto founder, you know how to find me!
— Sriram Krishnan – sriramk.eth (@sriramk) October 30, 2022
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022