ఈమధ్యకాలంలో ప్రేమికులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ప్రేమికుల్లోని ఎవరో ఒకరి కుటుంబ సభ్యులు వీరిపై దాడికి తెగబడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమికులు మరణించడం లేదా తీవ్రంగా గాయాలు కావడం జరుగుతుంది. ఇలాంటివి నిత్యం అనేకం చూస్తున్నాం. ఇటీవల నాగరాజు, నీరజ్ అనే ఇద్దరు యువకులను వారి భార్యల తరుపు వాళ్లు అత్యంత కిరతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా మరో ప్రేమ జంటపై అమ్మాయి తరపువారు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఏలూరు జిల్లా దెందలూరు మండలం చల్ల చింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, అదే ప్రాంతానికి చెందిన పావని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలిసింది. అమ్మాయి తరుపు వారు వీరి పెళ్లి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. దీంతో సాంబశివరావుపై పావని కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. దాడి చేయడానికి పథకం వేశారు. అదునుకోసం ఎదురుచూస్తున్నారు.
ఈక్రమంలో ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లులోని ఓ రెస్టారెంట్ లో ప్రేమ జంటపై దాడి చేశారు. యువతి తండ్రి, సోదరుడు ఈ దాడికి పాల్పడ్డారు. యువతి తండ్రి, తమ్ముడు.. సాంబశివరావు చెవి కొరికి, విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. దీంతో సాంబశివరావు, పావని ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ప్రేమ జంటలపై జరుగుతున్న ఈ వరుస ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.