ఒంటరి మహిళ, 70 ఏళ్లుగా అడివిలోనే ఉంటూ దైవ చింతనలోనే తన జీవితాన్ని దేవుడికి త్యాగం చేసిన దైవభక్తురాలు.. ఏంటీ.. నమ్మశక్యంగా లేదా..? మీరు నమ్మినా..నమ్మకపోయిన ఇది నిజం. ఈ కథను ఏ పురణాల నుంచో తొవ్వుకొచ్చిన కథ కాదిది.. యదార్థమైన కథ. అవును మీరు వింటున్నది నిజమే.
అది విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామం. పద్మావతి అనే వృద్ధురాలు గత 85 ఏళ్ల నుంచి గ్రామానికి సమీపంలోని ఓ అడవిలోనే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. దైవ చింతనలో భాగంగా తన 12 ఏళ్ల వయసులోనే అడవి బాట పట్టిన పద్మావతి వేంకటేశ్వర స్వామి పిలుస్తున్నారంటూ.. ఒంటరిగా అడవిలోకి వెళ్లింది. దీంతో అదే అడవిలో ఏడు దశబ్దాలుగా దేవునికి సేవ చేస్తూ జీవితాన్ని త్యాగం చేసింది.
ఇక గతంలో ఆ మహిళను అడవిలో నుంచి తీసుకొచ్చేందుకు గ్రామస్తులు అనేక ప్రయత్నాలు చేశారట. కానీ నేను ఎక్కడికి రానని ఇక్కడే ఉంటానంటూ ఆ వృద్ధురాలు తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పటికీ కూడా నా జీవితం ఆ వేంకటేశ్వర స్వామికి అంకితం అంటూ ఈ మహిళ భక్తికి నిదర్శనంగా మారుతోంది. ఇక ఈమె భక్తిని చూసిన గ్రామస్తులు ఏకంగా అక్కడే గుడిని సైతం నిర్మించారు.
దీంతో స్థానిక గ్రామస్తుల నుంచి భక్తులంతా వచ్చి ఆ దేవుడుని దర్శించుకుంటున్నారట. ఇక పద్మావతి దేవునికి భక్తులు సమర్పించే కార్పురం, ఆగబరబత్తులు, టీ తప్పా మరేది కూడా ఆహారంగా తీసుకోదని స్తానికులు తెలియజేస్తున్నారు. ఇక 70 ఏళ్లుగా అడవిలోనే ఉంటూ ఇంతటి భక్తిని చాటుకుంటున్న ఈ వృద్ధురాలుని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారట. ఇక ఈ వృద్ధురాలి దేవునిపై చాటుకుంటున్న ఇంతటి భక్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.