తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తారకరత్న అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. మెలెనా అనే అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నారని వైద్య బృందం ప్రకటించింది. జీర్ణశయాంతర (గ్యాస్ట్రో ఇంటెస్టినల్) రక్తస్రావాన్ని మెలెనాగా పేర్కొంటారు. మామూలుగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు.. నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం సంభవిస్తుంది. కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో […]