హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలు వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వీధులు, మండపాలు ఇళ్లల్లో పూజలందుకున్న చిన్న, పెద్ద విగ్రహాలు కలిపి మొత్తం 2.25 లక్షలకు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఒక్క ప్రధాన శోభాయాత్ర రోజునే సుమారు 1.2 లక్షల విగ్రహాలను నిమజ్జనం చేయగా, నగరవ్యాప్తంగా వివిధ మండపాల్లో ప్రతిష్టించిన 20,000కి పైగా భారీ విగ్రహాలు శోభాయాత్ర ద్వారా క్రేన్ల వద్దకు చేరుకున్నాయి. […]