ఈ అనంత సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని వింతలు చూసి మనం ఆశ్యర్యపోతుంటాం. అలాంటిదే ఈ వీడియో. పెద్ద చేప అంటే మనకు తెలిసినంతవరకు.. 50 కిలోలు.. 100 కిలోలు. అది తప్పు.. నేను అనకొండలాంటి చేపనంటోంది.. మనం చెబుతున్న చేప.
స్టర్జన్ ఫిష్ గా పిలవబడే ఈ చేప.. నార్త్ అమెరికాలో కనిపించిందని వార్తలొస్తున్నాయి. 10 నుంచి 15 అడుగుల పొడువు, దాదాపు 800 పౌండ్ల నుంచి 1000 పౌండ్ల బరువుంటున్నదని అంచనా వేస్తున్నారు. ఇంత సైజు, బరువు ఉన్న ఓ చేప( స్టర్జన్ ఫిష్) ఫ్రేజర్ నదిలో కనిపించింది. అనకొండలాగా ఉన్న ఈ చేపను చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చేప నోట్లో పడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Giant. pic.twitter.com/K8w1yW6kek
— Jamie Gnuman197… (@JGnuman197) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.