కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ పరిధిలోని రామ్ గోపాల్ పేట్ లో ఉన్న డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షోరూలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుదీర్ఘ సమయంపాటు ప్రాణాలకు తెగించి ఆ మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు స్థానికులు కొందరు తెలిపారు. అయితే మంటలు అదుపులోకి వచ్చిన తరువాత భవనంలోకి వెళ్లి పరిశీలించగా ఒక అస్థిపంజరం లభించింది. మిగిలిన ఇద్దరి వ్యక్తులకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో ఈ ఘటనపపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి డెడ్ బాడీలు ఎక్కడ అనే సందేహం వ్యక్తమవుతుంది.
జనవరి 19న సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్ గోపాల్ పేట్ డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూమ్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. తర్వాత అవి పై అంతస్తులోని స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. అంతేకాక పక్కన ఉన్న దుకాణాలు కూడా ఈ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. స్థానికులు అందించిన సమచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పటం మొదలుపెట్టారు. సుదీర్ఘ సమయం తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఈ భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కున్నారని స్థానికులు తెలిపారు.
గుజరాత్ కు చెందిన వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు వ్యక్తులు భవనం లోప చిక్కుకున్నట్లు కొందరు తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజు వరకు మంటల వేడి బాగా ఉంటంతో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు భవనం లోపలికి వెళ్లలేకపోయారు. భవనంలో మంటల వేడి పూర్తిగా చల్లారిన తరువాత డ్రోన్ సాయంతో, పాటు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లారు. ఈక్రమంలోనే భవనంలోని మొదటి అంతస్తులో పూర్తిగా కాలిన స్థితిలో ఓ అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు. ఈ అస్థి పంజరం ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురిలో ఒకరిదిగా పోలీసులు భావిస్తున్నారు. దక్కన్ మాల్ ను ఉదయం నుంచి సాయంత్రం వరకు అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీమ్ క్షుణ్నంగా పరిశీలించారు.
భవనం కూలిపోయే పరిస్థితిలో ఉన్న కూడా వారు ధైర్యంగా అన్ని అంతస్తుల్లోకి వెళ్లి.. మిగిలిన ఇద్దరి ఆనవాళ్లను సేకరించేందుకు తీవ్ర ప్రయత్నించారు. అయినప్పటికి శరీరాలు కాలిపోయిన చిన్న ఆనవాళ్లు కూడా లభించలేదు. దీంతో ఈఘటనలో ముగ్గురు చిక్కుకున్నారు అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా డెడ్ బాడీలు లభ్యం కానిది చనిపోయినట్లు నిర్ధారణ చేయలేరు. ఇదే సమయంలో భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు మిగిలిన ఇద్దరి వ్యక్తులు మృతదేహాలు కనుకుంటారా? లేదా? లేకుంటే మరే విధంగా ముందుకెళ్తారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక మిగిలిన ఆ ఇద్దరి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి అనే సందేహం వ్యక్తమవుతున్నాయి.
ఐదు రోజులుగా మంటల్లో ఉన్న ఈ భవన సముదాయంలోని శ్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతున్నాయి. ఆదివారం రెండో సెల్లారు, ఒకటి, రెండు, మూడు అంతస్తుల శ్లాబులు కూలి మొదటి సెల్లార్ లో పడిపోయాయి. ఈ క్రమంలో భవనం బలహీనపడి కుప్పకూలే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ భవనం పిల్లర్లు గట్టిగా ఉన్నప్పటికి ఏ క్షణమైన కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో చుట్టు పక్కల దుకాణాలు, ఇళ్ల వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించమని అధికారులు తేల్చిచెప్పారు. మరి.. భవనంలో మిగిలిన రెండు మృతదేహాలు కనిపించకపోవడంపై వ్యక్తమవుతున్న సందేహలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.