తెలంగాణలో గత కొద్ది కాలంగా టి కాంగ్రెస్ లో అంతర్గత పోరు కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు అధిష్టానం హెచ్చిరకలు జారీ చేస్తున్నా.. సీనియర్ నాయకులు నచ్చజెప్పుతున్నా.. కాంగ్రెస్ నేతల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు మరోసారి బయటపడిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డి జహీరాబాద్ వస్తున్నట్లు తనకు సమాచారం లేదని, వ్యక్తిగత ప్రచారానికే ఆరాటపడితే పార్టీలో కుదరదని జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య వివాదం ముగిసింది. ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ జగ్గారెడ్డికి సర్దిచెప్పారు. శుక్రవారం ఘటనపై జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు.
నేను కొన్ని విషయాలు మాట్లాడాను.. నా తప్పు జరిగింది. అటు సైడ్ కూడా తప్పు జరిగిందన్నారు జగ్గారెడ్డి.. కానీ, మళ్లీ రిపీట్ కాదని స్పష్టం చేశారు.. అందరం కలిసి మెలిసి పని చేస్తాం అన్నారు. దీనిపై క్యాడర్ అపోహలకు పోవద్దని సూచించారు. అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడటంపై జగ్గారెడ్డి సారీ చెప్పారు. తనదే మిస్టెక్ అని జగ్గారెడ్డి ఒప్పుకున్నారు. అయితే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే అలా జరిగిందని ఆ గొడవ సద్దుమణిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.