ప్రస్తుత కాలంలో దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. దీనికి తోడు 4జీ అందుబాటులోకి వచ్చింది. ఈ సమయంలో టెలికామ్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి ఇంటర్నెట్ ను చాలా తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చాయి. దాంతో చాలా మంది పోర్న్ సైట్ లకు, బ్లూ ఫిల్మ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. అలా బానిసలైన వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ల. పోర్న్ సైట్ ఓపెన్ చేసేవారిని లక్ష్యంగా చేసుకొని డబ్బును సంపాదించడానికి సైబర్ నేరగాళ్లు కొత్త దారులను వెతుకుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి:
వింత వ్యాధి! ప్రమేయం లేకుండానే కదులుతున్న కాళ్లు చేతులు!
భారత్ లో పోర్న్ సైట్లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయినా.. కొంతమంది ఇంకా ఆ సైట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కి బానిసలుగా మారుతున్నారు. వీరే ఇప్పుడు బలి పశువులు అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి ప్రభుత్వం నుంచి పంపినట్లు ఓ ఫేక్ పాప్ అప్ ను పంపారు సైబర్ కేటు గాళ్లు. అంతేకాకుండా కొన్ని సెక్షన్ల పేర్లను చెప్పి ఆ వ్యక్తిని భయపెట్టారు. ఆరు గంటల్లో తాము చెప్పిన అమౌంట్ పంపకపోతే… చట్టబద్ధమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని వారు తమ సందేశంలో పేర్కొన్నారు. ఇది బయట తెలిస్తే పరువు పోతుందనే భయంతో వారు అడిగినంత డబ్బు చెల్లించాడు సదురు వ్యక్తి. ఇలానే చాలా మంది యువత డబ్బును చెల్లిస్తున్నారని సమాచారం.
తాజాగా బాధితుడు మోసపోయిన ఘటనలో పాప్ అప్ నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి రాలేదని ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇదంతా డబ్బు లాగడానికి సైబర్ నేరగాళ్లు చేస్తున్న ట్రాప్ అని ఆయన పేర్కొన్నారు. ముందు పార్న్ సైట్లకు దూరంగా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్‌లో పడమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.