గాల్లో సూపర్ మ్యాన్‌లా తేలుతూ.. స్లిప్‌లో కళ్లు చెదిరే డైవ్ క్యాచ్‌లు ఎన్నో అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో కోహ్లీ ఒకడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఇప్పుడు కూడా ఫుల్ ఎనర్జీతో మైదానంలో మెరుపు వేగంతో కదులుతాడు. రన్‌మెషీన్‌గా బ్యాటింగ్‌తోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న కోహ్లీ.. ఫీల్డింగ్‌లోనూ సూపర్‌గా అదరగొడతాడు. అలాంటి కోహ్లీ అంత మంచి స్లిప్ ఫీల్డర్ కాదని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలో ఫీల్డింగ్ సామర్థ్యంపై స్పందిస్తూ.. అతని ఫీల్డింగ్ ప్రాక్టీస్ తన చావుకొచ్చేందని, కోహ్లీ అంత మంచి స్లిప్ ఫీల్డర్ కాదని శ్రీధర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘విరాట్ కోహ్లీ ఫుల్ ఎనర్జీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. మైదానంలోనూ మెరుపు వేగంతో చురుకుగా కదులుతాడు. కానీ కెరీర్ ఆరంభంలో కోహ్లీ స్లిప్‌లో అంత బాగా ఫీల్డింగ్ చేసేవాడు కాదు. ఈ లోపాన్ని అధిగమించేందుకు కోహ్లీ ఎంతో శ్రమించాడు. రోజులో కొన్ని గంటల తరబడి క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసేవాడు.
ఎంత సేపు ప్రాక్టీస్ చేసినా అసలు అలసిపోయేవాడు కాదు. నేనే ఇక చాలు కోహ్లీ అని చెప్తే.. ఏమైంది? అలసిపోయావా? అంటూ నన్ను ఆడిగేవాడు. అతనితో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయించడం నా చావుకొచ్చెది. దాదాపు కొన్ని వందల క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసేవాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఒక అత్యుత్తమ ఫీల్డర్‌గా ఉన్నాడంటే అందుకు కారణం అతను చేసిన ప్రాక్టీస్. స్లిప్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేయడానికి కోహ్లీ ఎంతో కష్టపడ్డాడు. గంటలకొద్ది తన కుడి వైపు, ఎడమవైపు బంతులను వేయించుకుని క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసేవాడు. అందుకే కోహ్లీ ఇప్పుడు ప్రపంచలోనే గొప్ప ఫీల్డర్లలో ఒకడిగా ఉన్నాడు. ఫీల్డింగ్ విషయంలో యువ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన టెంప్లేట్.’ అని శ్రీధర్ అన్నారు.
కోహ్లీతో చాలా కాలం పాటు కోచ్‌గా ట్రావెల్ చేసిన శ్రీధర్ అతన్ని కెరీర్ ఆరంభం నుంచి గమనిస్తున్నారు. కోహ్లీలో కెరీర్ ఆరంభంలో ఎలాంటి ఉత్సహం, దూకుడు, చురుకుతనం ఉందో.. కెప్టెన్ అయినా తర్వాత, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. మరి కోహ్లీ విషయంలో శ్రీధర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పుజారా సాధించాడు! కోహ్లీకి ఎందుకు సాధ్యం కావడం లేదు?
Perfect timing on that jump and a stunner for Virat Kohli. He has been so good in fielding today ❤️ pic.twitter.com/H44AGT5Pd5
— Akshat (@AkshatOM10) April 16, 2022
Congratulations @imVkohli for completing #100 catches in TEST cricket! You & solely you have taken Indian fielding to a different height with your practice, passion & aggression.
May your tribe live on forever #INDvsSA #TestCricket #ViratKohli #catcheswinmatches #Courage @BCCI pic.twitter.com/GoX8J8kefU— R SRIDHAR (@coach_rsridhar) January 12, 2022