ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శనే చేసింది. కానీ, ఆదివారం సౌత్ ఆఫ్రికాపై మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ మినహా.. ఇండియా మిడిల్ ఆర్డర్ వరకు పూర్తిగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడీ సూపర్ స్పెల్ తో భారత్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 4 ఓవర్లలో 10 డాట్ బాల్స్ వేసి.. కేవలం 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సైత్ ఆఫ్రికా బౌలర్లను కేవలం సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే సమర్థంగా ఎదుర్కొన్నాడు.
ఇంక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో కోహ్లీ రాణింస్తాడని ప్రపంచ రికార్డు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ సహా అంతా ఎదురుచూశారు. కానీ, కోహ్లీ మాత్రం ఈరోజు నిరాశ పరిచాడు. 11 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఈరోజు ఆటలో కోహ్లీ 28 పరుగులు గనుక చేసుంటే అంతర్జాతీయ టీ20ల్లో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసేవాడు. కాకాపోతే ఈ ప్రదర్శనతోనే కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. తొలి భారత క్రికెటర్ గా రికార్డుల కెక్కాడు. అదేంటంటే.. ఈ మ్యాచ్ లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ టీ20 వరల్డ్ కప్పుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరో పరుగు చేసి 12 పరుగులకు ఔట్ అయ్యాడు.
1⃣0⃣0⃣0⃣ runs in the #T20WorldCup! 👌 👌
Well done, @imVkohli! 🙌 🙌
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6 #TeamIndia | #T20WorldCup | #INDvSA pic.twitter.com/FZN7ZEICxr
— BCCI (@BCCI) October 30, 2022
కోహ్లీ ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్పుల్లో 22 ఇన్నింగ్సులు ఆడి మొత్తం 1001 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీ 28 పరుగులు చేసుంటే.. మహేళ జయవర్దనే పేరిట ఉన్న టీ20 వరల్డ్ కప్పుల్లో 1016 పరుగుల రికార్డును బద్దలు కొట్టే వాడు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత బ్యాటర్లు సౌత్ ఆఫ్రికా బౌలర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. రాహుల్(9), రోహిత్(15), కోహ్లీ(12), సూర్యకుమార్ యాదవ్(68), దీపక్ హుడా(0), హార్దిక్ పాండ్యా(2), దినేశ్ కార్దీక్(6), అశ్విన్(7), భువనేశ్వర్(4*), షమీ(0), అర్షదీప్ సింగ్(2) పరుగులు చేశారు. లుంగీ ఎంగిడీ 4 వికెట్లు, పార్నెల్ 3, నోకియా 1 వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తేనే సాధ్యం అవుతుంది.
MILESTONE ALERT 🚨
Virat Kohli becomes the second player to get to 1000 runs in the Men’s #T20WorldCup 🙌 pic.twitter.com/IcijlHoqWH
— ICC (@ICC) October 30, 2022